డ్రగ్స్ ఈ పదం ఒకప్పుడు టాలీవుడ్ ఇండస్ట్రీ ని తలక్రిందులు చేసిన సంగతి తెలిసిందే. అప్పట్లో ఈ కేసులో ఉన్న టాలీవుడ్‌కు చెందిన పలువురు హీరోలు, హీరోయిన్లు, జూనియర్ ఆర్టిస్టులను విచారించిన సంగతి కూడా తెలిసిందే. తాజాగా..ఈ కేసు విషయం లో షాకింగ్ విషయాలు వెలుగు చూశాయి. 👉ఓ సామాజిక కార్యకర్త ఈ కేసు గురించి సమాచార హక్కు చట్టం ద్వారా ఎక్సైజ్ డిపార్ట్మెంట్ను సంప్రదించగా ఈ షాకింగ్ విషయాలు వెలుగు చూశాయి. ఈ కేసులో అప్పట్లో సిట్ దాఖలు చేసిన 4 చార్జిషీట్లలో 62 మంది పేర్లు లేకపోవడం గమనార్హం. అవి కూడా 62 మంది హీరో, హీరోయిన్స్, దర్శకులు, సినీ తారగణం.
ముఖ్యంగా ;
🔴డైరెక్టర్ పూరీ జగన్నాథ్
🔴శ్యామ్ కే. నాయుడు
🔴నటుడు సుబ్బరాజు
🔴హీరో తరుణ్
🔴హీరో నవదీప్
🔴నవపాద ధర్మారావ్(చిన్నా)
🔴నటి ఛార్మీ కౌర్
🔴నటి ముమైత్ ఖాన్
🔴హీరో రవితేజ
🔴శ్రీనివాస్ (రవితేజ కారు డ్రైవర్)
🔴యంగ్ హీరో తనీష్
🔴హీరో నందుతో పాటు పలువురు ప్రముఖులు .వీరి నుంచి గతంలో గోర్లు, వెంట్రుకల నమూనాలను సిట్ సేకరించిన విషయం విదితమే. . అయితే ఇప్పుడు ఆ సినీ సెలబ్రెటీలకు సిట్ క్లీన్ చిట్ ఇచ్చెయ్యడం రచ్చ లేపుతుంది.
మొత్తానికి చూస్తే.. ఈ డ్రగ్స్ కేసు వ్యవహారాన్ని సిట్ తూతూ మంత్రంగానే చార్జిషీట్ల వేసిందని విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. టాలీవుడ్ డ్రగ్స్ వ్యవహారంలో మొత్తం 12 కేసులను నమోదు చేసింది. అయితే దాఖలైన చార్జిషీట్లలో సినీ సెలబ్రెటీలకు క్లీన్ చిట్ ఇచ్చింది. సిట్ అధికారులు చార్జిషీట్లు దాఖలు చేసిన నాల్గింటిలో ఒకటి సౌత్ ఆఫ్రికా పౌరుడు రఫెల్ అలెక్స్ విక్టర్‌పై ఉంది. ముంబై నుంచి హైదరాబాద్‌కు కొకైన్‌ను తరలించి విక్రయిస్తున్నాడని 2017 ఆగస్టులో అరెస్ట్ చేశారు.
మొత్తానికి తెర వెనుక ఏదో జరిగింది.. వీళ్ళంతా బయటపడ్డారు.