కొత్తగా ఇల్లు కట్టుకునే టప్పుడు సొంత ఇల్లయినా అద్దె ఇల్లయినా ఒక ఇంటిలోకి ప్రవేశించేటప్పుడు మనం వాస్తు చూసుకునే ముందుకు వెళ్తాము. అసలు వాస్తుశాస్త్రం ,వాస్తు పురుషోత్పత్తి ఎలా జరిగిందో తెలుసుకుందాం.
🔅వాస్తు పురుషుడి పుట్టుక : పూర్వం అంధకాసుర వధ సందర్భంలో శివుని లలాటం నుండి చెమటబిందువు జారిపడింది. దానినుండి భయంకరరూపం గల భూతం ఒకటి ఉత్పన్నమైంది. అది భూమిపై పడిన అంధకుని రక్తమంతా తాగింది. అయినా తృప్తి కలగలేదు. ఆకలి తీరలేదు.ఆ భూతం శివుని గురించి దారుణమైన తపస్సు చేసింది. కొంతకాలానికి శివుడు ప్రత్యక్షమై ఏం కావాలో కోరుకోమన్నాడు. ఆ భూతం మూడులోకాలు మింగే శక్తి కావాలని కోరుకుంది. బ్రహ్మ తథాస్తు అన్నాడు. ఆభూతం తర్వాత విజృంభించి భూమండలాన్ని ఆక్రమిస్తూ అడ్డంగా పడుకుంది. అది చూసి భయపడ్డ దేవాసురులు ఆ భూతాన్ని తొక్కి అణిచిపెట్టారు. ఆ భూతం తన ఆకలి తీరే మార్గలేదని ఆక్రోశించింది. అప్పుడు బ్రహ్మాది దేవతలు యజ్ఞాలలో వేసే వాస్తుబలి నీకు ఆహారం
అవుతుంది” అని ఆ భూతాన్ని అనుగ్రహించారు. అప్పటి నుండి ఆభూతం వాస్తుపురుషుడిగా వాస్తుపూజలందుకుంటున్నాడు. ఆ విధంగా వాస్తు పురుషుడు అనే భూతానికి అప్పటి నుండి మనం వాస్తు పూజలు చేస్తున్నాం.