వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు వైయస్ జగన్మోహన్ రెడ్డి ఆంధ్రప్రదేశ్ రెండో ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చేశారు. గురువారం మధ్యాహ్నం ఆయనతో గవర్నర్ నరసింహన్ ఏపీ సీఎంగా ప్రమాణ స్వీకారం చేయించారు. జగన్ ప్రమాణ స్వీకారానికి తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్, డీఎంకే చీఫ్ స్టాలిన్ తదితరులు హాజరయ్యారు. ప్రమాణ స్వీకారం అనంతరం జగన్ తన హామీలు, నవరత్నాల గురించి మాట్లాడారు. .
🎙”వైయస్ జగన్ అను నేను మీ అందరికీ ఒకే మాట చెబుతున్నా.. నేను ఉన్నానని గట్టిగా చెబుతున్నా… ఆకాశమంతటి విజయాన్ని అందించిన మీ అందరికీ కృతజ్ఞతలు…. పదేళ్లుగా నా రాజకీయ జీవితంలో 3,648 కి.మీ పాదయాత్ర చేశా… పాదయాత్రలో పేదలు పడిన కష్టాలు చూశానని.. జగన్ పేర్కొన్నారు. అనంతరం వైయస్సార్ పింఛన్ ఫైల్ పైన తొలి సంతకం చేస్తున్నట్లు ప్రకటించారు. పింఛన్ విషయంలో ఏపీ వాసులకు శుభవార్త చెప్పారు. పింఛన్ క్రమంగా పెంచుతామన్నారు.