నిమ్మకాయ.. దీని గురించి ప్రత్యేకంగా చెప్పక్కర్లేదు. ముఖ్యంగా నిమ్మ కాయలు భారతదేశంలో విరివిగా లభ్యమవుతుంటాయి. ప్రతి ఒక్కరి వంటింట్లోనూ నిమ్మకాయలు దర్శనమిస్తాయి. నిమ్మలో విటమిన్ సి, కాల్షియం, పాస్పరస్, మెగ్నీషియం, విటమిన్ బి, ప్రోటీన్స్, కార్బోహైడ్రేట్స్ ఇందులో పుష్కలంగా ఉన్నాయి. ఇలా ఎన్నో పోషక పదార్ధాలు ఉన్న నిమ్మ ఆరోగ్యానికి ఎంతో మంచిది. అయితే నిమ్మకాయలను ఆహారంగా తీసుకోవడం వల్లే కాదు. ఇంట్లో ఉంచుకున్నా సరే ఆరోగ్యానికి మంచిదే అంటున్నారు ఆరోగ్య నిపుణులు.
ముఖ్యంగా నిద్రంచే ముందు బెడ్రూంలో నిమ్మ ముక్కలను పెడితే..
అద్భుత ప్రయోజనాలు పొందొచ్చు. నిమ్మరసం నుండి వచ్చే వాసనలో యాంటీ బ్యాక్టీరియల్ లక్షణాలు ఎక్కువగా ఉంటాయి. శ్వాసనాళ సమస్యల వల్ల నిద్ర సరిగా పట్టకపోతే, బెడ్రూంలో నిమ్మముక్కలు పెట్టడం వల్ల నాజల్ ఫ్రీ అవ్వడంతో పాటు బాగా నిద్రపడుతుంది. అలాగే నిమ్మ ముక్కలను బెడ్రూంలో పెట్టుకోవడం వల్ల.. దాని నుండి వచ్చే వాసన డిప్రెషన్‌ను తొలగిస్తుంది. మరియు నిమ్మ వాసన వల్ల యాంగ్జైటీ దూరమై మీలో పాజిటీవ్ ఫీలింగ్స్ కలుగుతాయి.
నిమ్మకాయలను రూమ్‌లో పెడితే ప్రత్యేకంగా రూమ్ ప్రెషర్ అవసరం ఉండదు. నిమ్మ వాసనతో గది పరిమళ భరింతం అవుతుంది. దీంతో మీ మైండ్ రిలాక్స్ అవుతుంది. ఇక బెడ్ రూమ్ లో మీ నిద్రను పాడుచేస్తున్న ఈగలు, దోమలు, ఇతర కీటలను నివారించే శక్తిసామర్థ్యం నిమ్మరసంలో పుష్కలంగా ఉంది. అందుకే నిమ్మకాయ ముక్కలను బెడ్ రూమ్ లో పెట్టుకోవడం వల్ల, దోమలు, కీటకాలతో ఎలాంటి అంతరాయం కలగకుండా నిద్రపోవచ్చు. ఇక నిద్రంచే ముందు బెడ్రూంలో నిమ్మ ముక్కలను పెట్టడం వల్ల ఊపిరితిత్తుల పనితీరు కూడా మెరుగుపడుతుందని నిపుణులు అంటున్నారు.