ఆ నటుణ్ని పవర్ స్టార్ వదిలేసిన సూపర్ స్టార్ ఆదరించాడు

Spread the love

అవును ఆ నటుణ్ని సూపర్ స్టార్ ఆదరించాడు. కానీ ఇక్కడ సూపర్ స్టార్ అంటే మన మహేష్ బాబు కాదు బాలీవుడ్ సూపర్ స్టార్ సల్మాన్ ఖాన్.ఆ నటుడు ఆలీ 🔸పవన్ కళ్యాణ్ – అలీ : గతంలో పవన్ కళ్యాణ్ ఏ సినిమా చూసిన అందులో ఈ కాంబినేషన్ గ్యారంటీ గా ఉండేది. అంత స్నేహానుబంధం వాళ్లది .కానీ తాజా రాజకీయ పరిణామాలు వల్ల వారి మధ్య అగాధం ఏర్పడింది .స్నేహ బంధం కూడా చెడింది అంటున్నారు చాలామంది. ఆ మధ్యన పవన్ కళ్యాణ్ అలీ పై వ్యాఖ్యలు చేయడం దానికి బదులుగా పవర్ స్టార్ అని కూడా చూడకుండా అలీ కూడా దానికి ఘాటుగా బదులివ్వడంతో ఇక అలీకి ఆఫర్స్ రావు అనుకున్నారు అందరు. కానీ తాజాగా అలీకి వచ్చిన ఆఫర్ చూసి అంతా ఆశ్చర్య పోతున్నారు.

👉విషయంలోకి వెళితే :బాల నటుడు నుంచి స్టార్ కమిడియన్ , హీరోగా ఎదిగి క్యారక్టర్ ఆర్టిస్ట్ గా సెటిలయ్యారు అలీ. రీసెంట్ గా రాజకీయాల్లోకి వచ్చి రచ్చ రచ్చ చేసారు. పవన్ కళ్యాణ్ ని ఎదురు ప్రశ్నించి మెగాభిమానుల ఆగ్రహానికి గురి అయ్యారు. మెగా క్యాంప్,సపోర్టర్స్ కూడా ఇక అలీ ని దూరం పెడుతారేమో అనుకున్న స్దితిలో అలీ …భారీ ఎత్తున నిర్మిస్తున్న ఓ బాలీవుడ్ చిత్రంలో కనపడి షాక్ ఇచ్చారు. అలీ ఏకంగా ‘దబాంగ్ 3’ సినిమాలో అవకాశాన్ని దక్కించుకున్నాడు.
స‌ల్మాన్ ప్ర‌స్తుతం సూప‌ర్ హిట్ సిరీస్ ద‌బాంగ్‌లో భాగంగా ద‌బాంగ్ 3 చిత్రం చేస్తున్నాడు. ప్ర‌భుదేవా ద‌ర్శ‌క‌త్వంలో తెర‌కెక్కుతున్న ఈ చిత్రంలో సోనాక్షి సిన్హా హీరోయిన్ గా న‌టిస్తుంది. సుదీప్ విల‌న్‌గా కనిపించ‌నున్నాడు. ఈ క్రేజీ ప్రాజెక్ట్‌లో అలీకి అవ‌కాశం రావ‌డం చాలా గొప్ప విష‌య‌ం. దాంతో అంతా ఆశ్చర్యపోతున్నారు. అయితే తెలుగు మార్కెట్ కోసం సల్మాన్ ఖాన్ , ప్రభుదేవా కలిసి ఈ నిర్ణయం తీసుకున్నట్లు తెలుస్తోంది. ఈ సినిమాలో కానిస్టేబుల్ పాత్ర‌లో అలీ సంద‌డి చేయ‌నున్నాడు.
దబాంగ్ రీమేక్ గబ్బర్ సింగ్ లో అలీ చేసిన కానిస్టేబుల్ పాత్ర నచ్చే ఈ క్యారక్టర్ ఇచ్చారంటోంటి టీమ్. ఇటీవలే ఈ సినిమా షూటింగు మొదలైంది. ఆ సమయంలోనే ఈ సినిమా సెట్ లో సల్మాన్ తో కలిసి తన ఫ్యామిలీతో అలీ ఫొటో దిగాడు. ఇందులో అలీ ఫ్యామిలీ కూడా ఉన్నారు . ఈ చిత్రం త‌ర్వాత అలీకి బాలీవుడ్‌లోను మరిన్ని ఆఫ‌ర్స్ వ‌స్తాయ‌ని అంటున్నారు. మొత్తానికి కి ఇండస్ట్రీ ఏదైతేనేం కమెడియన్ అలీ అక్కడ కూడా చక్రం తిప్పేస్తాడేమో చూద్దాం.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *