రాజమౌళి పేరు వాడుతూ ఘరానా మోసం :వెంటనే స్పందించిన RRR టీమ్

Spread the love

Teluguwonders:

🌟RRR మూవీ :

రాజమౌళి తెరకెక్కిస్తున్న RRR సినిమాలో రామ్ చరణ్, ఎన్టీఆర్ లీడ్ రోల్స్ పోషిస్తున్నారు. రామ్ చరణ్ అల్లూరి సీతారామరాజు పాత్రలో నటిస్తుండగా, ఎన్టీఆర్ కొమరం భీమ్‌ పాత్ర పోషిస్తున్నారు. బాలీవుడ్‌ నటి ఆలియా భట్‌ చెర్రీ సరసన నటిస్తోంది. ఎన్టీఆర్ హీరోయిన్ కన్ఫర్మ్ కావాల్సి ఉంది. అజయ్‌ దేవగణ్‌ కీలక పాత్రలో నటిస్తున్నారు. 👉వినోద ప్రసార మాధ్యమిక రంగం లో ఇప్పుడు సాంకేతికత పెరుగుతుంది. ఐతే పెరుగుతున్న సాంకేతికత సరికొత్త మోసాలకు కూడా తెర లేపుతోంది. సైబర్ నేరగాళ్లు రోజు రోజుకూ రెచ్చిపోతూ కొత్త కొత్త మోసాలకు పాల్పడుతున్నారు. ఈ నేపథ్యంలో ఏకంగా సైబర్ కేటుగాళ్ల కన్ను రాజమౌళిపై పడింది. దర్శకధీరుడిని అడ్డం పెట్టుకొని కొందరు కేటుగాళ్లు మోసాలకు పాల్పడుతున్నారు. ఈ విషయం RRR నిర్మాతల దృష్టికి రావడంతో వెంటనే అలర్ట్ చేస్తూ ట్వీట్స్ పెట్టారు. ఇంతకీ విషయం ఏంటి?

వివరాల్లోకి పోతే..

🔴రాజమౌళి RRR సినిమా క్రేజ్‌ని క్యాష్ చేసుకోవాలని ప్లాన్ :

బాహుబలి సినిమాతో సెన్సేషన్ క్రియేట్ చేయడమే గాక తెలుగు సినిమా ఖ్యాతిని ప్రపంచానికి చాటి చెప్పారు ఎస్ఎస్ రాజమౌళి. ఈయనే ఇప్పుడు ఇద్దరు టాలీవుడ్ క్రేజీ హీరోలతో RRR సినిమా రూపొందిస్తున్నారు. దీంతో ఈ పాయింట్ బేస్ చేసుకొని అమాయకులకు ఎర వేస్తూ డబ్బులు దండుకుంటుంటున్నారు కొందరు సైబర్ నేరగాళ్లు. ఈ రకంగా రాజమౌళి క్రేజ్‌ని క్యాష్ చేసుకునేందుకు ప్రయత్నిస్తున్నారు.

🔴రాజమౌళి మనుషులమని..:

కొంతమంది కేటుగాళ్ళు తాము రాజమౌళి మనుషులమని,RRR లో అవకాశం ఇస్తామంటూ ఎర..చూపిస్తూ RRR సినిమాకు కాస్టింగ్ అంటూ ట్విట్టర్, ఫేస్‌బుక్, ఇన్స్‌స్టాగ్రామ్ లాంటి సోషల్ మీడియా వేదికల ద్వారా నకిలీ ప్రకటనలు ఇస్తున్నారు. తాము రాజమౌళి మనుషులమని, RRRలో నటించే అవకాశం పొందండి అంటూ అమాయకులకు ఎర వేస్తున్నారు. ఆ తర్వాత వారి వద్ద నుంచి అందినంత సొమ్ము దోచుకుంటున్నారు ఈ మోసగాళ్లు.ఐతే ఈ ఉదంతాలు RRR యూనిట్ వరకూ వచ్చాయి.

🔴వదంతులు నమ్మొద్దు.. :

నిర్మాణ సంస్థ డీవీవీ ఎంటర్‌టైన్‌మెంట్ దృష్టికి రావడంతో వెంటనే అలర్ట్ చేస్తూ ట్వీట్స్ పెట్టారు. అలాంటి తప్పుడు ప్రచారాలను ఎవరూ నమ్మవద్దని.. తమకు, తమ సినిమాకు నూతన నటీనటులు కావాలంటే తమ అధికారిక ఖాతాల ద్వారా మాత్రమే వెల్లడిస్తామని స్పష్టం చేశారు డీవీవీ ఎంటర్‌టైన్‌మెంట్ సంస్థ యాజమాన్యం.శరవేగంగా షూటింగ్ జరుపుకుంటున్న ఈ సినిమా 2020 జులై నెలాఖరులో విడుదల కానుంది.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *