Samantha : సోషల్ మీడియా ద్వారా తన ఆరోగ్యం గురించి అభిమానులతో పంచుకున్న సమంత.. ఆ తరవాత మళ్లీ ఈ విషయంపై మాట్లాడలేదు.ఐతే, ఇప్పుడు మొదటి సారి తన ఆరోగ్యం గురించి స్పష్టత ఇచ్చిన సమంత. ఆమె ప్రధాన పాత్రలో నటించిన సినిమా ‘యశోద’. ఈ సినిమాలో సమంత సరోగసీ మదర్‌గా నటించారు. థ్రిల్లర్ జోనర్‌లో రూపొందిన ఈ యాక్షన్ సినిమా పాన్ ఇండియా స్థాయిలో తెరకెక్కింది. ఈనెల 11న ప్రేక్షకుల ముందుకు రాబోతుంది . ఈ సినిమాకు సమంత నే తెలుగు, తమిళంలో డబ్బింగ్ చెప్పుకున్నారు.
యశోద సినిమా ప్రమోషన్స్ లో భాగంగా సమంత తన జీవితం చాలా ఎమోషనల్ అయింది. ‘‘జీవితంలో కొన్ని మంచి రోజులు ఉంటాయి.. కొన్ని చెడ్డ రోజులు ఉంటాయని నా సోషల్ మీడియా పోస్టులో నేను పోస్ట్ చేస్తూ చెప్పాను. ఇంకొక్క అడుగు ముందుకు వేయలేనేమో నాకు అనిపించింది. కానీ, వెనక్కి తిరిగి చూసుకుంటే నిజంగా ఇక్కడికి వచ్చానా అని అనిపిస్తుంది. నేను ఇలాగే ఒంటరిగా పోరాడతా. ఈ పోరాటంలో మేం గెలుస్తాం’’ అని సమంత చాలా ఎమోషనల్ అవుతూ…ఎన్నడూ లేని విధంగా కంటతడి పెట్టుకున్నారు. ఈ సమయంలో తన అరోగ్యం గురించి ఆమె ఒక విషయం స్పష్టం చేశారు.