Teluguwonders:
సాహో’ సినిమా విడుదల కాకముందు నుండే వివాదాలలో ఉంది . ఈ సినిమాను హాలీవుడ్ సినిమా లార్గో వించ్‌ను కాపీ కొట్టి తీశారని ఫ్రెంచ్ దర్శకుడు జెరోమ్ సాల్ ఆరోపించారు. తీరా సినిమా విడుదలయ్యాక.. సినిమా తీయడం రాకపోతే కనీసం కాపీ కొట్టడం అయినా నేర్చుకోండి అని కామెంట్ చేశారు. పలువురు సినిమా క్రిటిక్స్ కూడా సాహో సినిమాలో లార్గో వించ్‌లో దగ్గరి పోలికలున్నాయని రాశారు.
దర్శకుడు సుజీత్ తెరకెక్కించిన సాహో సినిమా హాలీవుడ్‌లో విడుదలైన లార్గో వించ్ సినిమాను పోలి ఉందని ఎప్పటినుంచో వార్తలు వస్తున్నాయి. దీనిపై తాజాగా సుజీత్ స్పందించారు. అసలు తాను చూడని సినిమాను ఎలా కాపీ కొడతానని ప్రశ్నిస్తున్నారు. ఈ వివాదం తో మన తెలుగు వారి దగ్గర కథలు లేవా? అన్న ఆలోచన ప్రేక్షకుల్లో కలిగింది.
💥Saaho సినిమా కాపీ కాదు చూసి మాట్లాడండి -సుజీత్ స్పందన :
ఈ కామెంట్లపై తాజాగా సుజీత్ ఓ ఇంటర్వ్యూలో స్పందించారు. ‘అసలు నేను చూడని సినిమాను ఎలా కాపీ కొడతాను? ఈ ఆరోపణలు చేస్తున్నవారంతా బహుశా సాహో సినిమాను సరిగ్గా చూసి ఉండరు. నేను రన్ రాజా రన్ సినిమా బేసిక్ స్టోరీలో కాస్త మార్పులు చేసి సాహో స్క్రిప్ట్ రాశాను. తన స్వస్థలానికి దూరంగా ఉంటున్న హీరో తన తండ్రి వారసుడిని నేనే అని ఎలా నిరూపించుకున్నాడు అన్నది లార్గో వించ్ మెయిన్ ప్లాట్. హీరో తండ్రి చనిపోయే సినిమాలన్నీ లార్గో వించ్ నుంచి కాపీ కొట్టినవేనా?’ సాహో స్టోరీ అది కాదు కదా.. అని మండిపడ్డారు.
⭐‘అజ్ఞాతవాసి’ సినిమాకు కూడా :
ఈ అనుభవం మాటల మాంత్రికుడు త్రివిక్రమ్ శ్రీనివాస్ తెరకెక్కించిన ‘అజ్ఞాతవాసి’ సినిమాకు కూడా ఎదురైంది. ఇందులో పవన్ కల్యాణ్, అను ఇమ్మాన్యుయెల్, కీర్తి సురేశ్ ప్రధాన పాత్రల్లో నటించారు. ఈ సినిమా ప్లాట్‌ను కూడా లార్గో ఫించ్ నుంచే కాపీ కొట్టారని జెరోమ్ అప్పట్లో ఆరోపణలు చేశారు. సినిమా విడుదలయ్యాక ఈ ఆరోపణలను ప్రేక్షకులు మరిచిపోతారు అనుకుంటే సినిమా కాస్తా బాక్సాఫీస్ వద్ద ఫెయిల్ అయ్యింది. కానీ సాహో సినిమా మాత్రం బాక్సాఫీస్ వద్ద మంచి విజయం సాధించింది. వరల్డ్ వైడ్ ఈ సినిమా రూ.350 కోట్లకు పైగా వసూళ్లు రాబట్టింది.
🔴‘అజ్ఞాతవాసి’ ఫ్లాప్ అవ్వడం తో :
సాహో సినిమాపై నెగిటివ్ ప్రచారం చేస్తోందని పవన్ కల్యాణ్ అభిమానులేనని ఇటీవల వివాదాస్పద నటి శ్రీరెడ్డి ఆరోపించింది. బహుశా ‘అజ్ఞాతవాసి’ ఫ్లాప్ అయిందన్న కోపంతో ప్రభాస్ సినిమాపై బురద జల్లాలని అనుకున్నారేమో. ఎందుకంటే.. ఈ రెండు సినిమాలు కాపీ కొట్టి తీశారని జెరోమ్ ఆరోపించారు. ‘అజ్ఞాతవాసి’ ఎటూ ఆడలేదు కాబట్టి సాహో కూడా హిట్టవ్వకూడదని పవన్ అభిమానులు ఇలా నెగిటివ్ ప్రచారం కల్పించి ఉంటారని శ్రీ రెడ్డి లాంటి వారి భావన .కానీ పవన్ అభిమానులు ఇలా చేసారు అనడం లో నిజం లేదు అని చాలా మంది మాట.