R R R టీం నుంచి సర్ప్రైజింగ్ న్యూస్ : మే 20 న కొమరం భీమ్ గా తారక్ ఫస్ట్ లుక్

Spread the love

జూనియ‌ర్ ఎన్టీఆర్ పుట్టిన రోజు వేడుక‌ల‌కు దూరంగా ఉండ‌బోతున్నాడు. ఇప్ప‌టికే ఈ విష‌యాన్ని త‌న అభిమానుల‌కు కూడా చెప్పాడు ఎన్టీఆర్. తండ్రి హ‌రికృష్ణ మ‌ర‌ణం కార‌ణంగా ఈ పుట్టిన రోజు వేడుక‌లు చేసుకోకూడ‌ద‌ని ఫిక్సైపోయాడు ఎన్టీఆర్. దాంతో ఫ్యాన్స్ ముందు కాస్త నిరాశ ప‌డినా కూడా కార‌ణం స‌రైందే కావ‌డంతో స‌ర్దుకుంటున్నారు. పైగా ఎన్టీఆర్ కూడా ఈ బ‌ర్త్ డేను కేవ‌లం కుటుంబ స‌భ్యుల‌తోనే గ‌డ‌పాల‌ని నిశ్చ‌యించుకున్నాడు. మే 20న ఎలాంటి స్పెష‌ల్ ఉండ‌దని జూనియ‌ర్ ఫ్యాన్స్ కూడా కాస్త నిరాశ‌లో ఉన్న ఈ స‌మ‌యంలో రాజ‌మౌళి స‌డ‌న్ షాక్ ఇవ్వ‌బోతున్నాడ‌ని తెలుస్తుంది.

👉ఆర్ఆర్ఆర్ ఫ‌స్ట్ లుక్ :
ఆర్ఆర్ఆర్ ఫ‌స్ట్ లుక్ ఆ రోజు విడుద‌ల చేస్తున్న‌ట్లు ప్ర‌చారం జ‌రుగుతుంది. రామ్ చ‌ర‌ణ్, ఎన్టీఆర్ హీరోలుగా ద‌ర్శ‌క‌ధీరుడు తెర‌కెక్కిస్తున్న ఈ మ‌ల్టీస్టార‌ర్ ఇప్పుడు ఇండియ‌న్ వైడ్‌గా క్రేజ్ తెచ్చుకుంది. ఇక ఇప్పుడు ఎన్టీఆర్ జ‌న్మ‌దినం సంద‌ర్భంగా మే 20న ఈ చిత్ర ఫ‌స్ట్ లుక్ విడుద‌ల చేయ‌బోతున్న‌ట్లు తెలుస్తుంది.

👉కొమరం భీమ్గా జూనియర్ ఎన్టీఆర్ :

కొమ‌రం భీంగా ఎన్టీఆర్ ఉండే లుక్ ఆ రోజు విడుద‌ల కానున్న‌ట్లు ప్ర‌చారం జ‌రుగుతుంది. అయితే దీనిపై ఎలాంటి క‌న్ఫ‌ర్మేష‌న్ మాత్రం రాలేదు. రాజ‌మౌళి దీన్ని స‌ర్ ప్రైజ్ ప్యాకేజ్ కింద ఉంచాల‌ని ప్లాన్ చేస్తున్నాడు. క‌చ్చితంగా ఈ గిఫ్ట్ ఎన్టీఆర్ అభిమానుల‌కు న‌చ్చుతుంద‌ని ఆయ‌న భావిస్తున్నాడు. 350 కోట్ల‌తో దాన‌య్య ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నాడు. మ‌రి చూడాలిక‌.. రాజ‌మౌళి ఇవ్వ‌బోయే గిఫ్ట్ ఎలా ఉండబోతుందో చూడాలి. so fans wait for tarak’s first look…

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *