కమెడియన్ శ్రీనివాస రెడ్డి త్వరలో దర్శకుడుగా కూడ మారబోతున్నాడు. నటుడుగా మంచిపేరు తెచ్చుకున్నా అనుకున్న స్థాయిలో రాణించలేకపోవడంతో ఇప్పుడు ఈదర్శకుడు అవతారంలో తన అదృష్టాన్ని వెతుక్కోబోతున్నాడు. ఇలాంటి పరిస్థుతులలో ఇతడు ఒకమీడియా సంస్థకు ఇచ్చిన ఒకఇంటర్వ్యూలో ఒకప్పుడు జూనియర్ తో తనకు ఏర్పడ్డ విభేధాలలోని అసలు నిజాలను బయటపెట్టి క్లారిటీ ఇవ్వడానికి తనవంతు ప్రయత్నం చేసాడు.
శ్రీనివాస రెడ్డి జూనియర్ ఎన్టీఆర్ కు ఉన్న అతి కొద్దిమంది సన్నిహిత మిత్రులలో ఒకడిగా కొనసాగిన విషయాలను గుర్తు చేసుకుంటూ తన కూతురుకి స్వయంగా జూనియర్ పేరు పెట్టడంతో పాటు అప్పట్లో జరిగిన తనకూతురు ఉయ్యాల ఫంక్షన్ కుజునియర్ స్వయంగా వచ్చి అన్నీ తానై నడిపించిన విషయాలను గుర్తుకు చేసుకున్నాడు. అయితే తాను జూనియర్ కు దూరం కావడానికి రకరకాల కారణాలు ఉన్నాయి అని చెపుతూ జూనియర్ తో సన్నిహితంగా ఉండే కొందరు వ్యక్తులు చేసిన తప్పుడు ప్రచారం వల్ల తమఇద్దరి మధ్య గ్యాప్ ఏర్పడింది అన్నఅభిప్రాయాన్ని వ్యక్త పరిచాడు.
ముఖ్యంగా 2009 ఎన్నికల ప్రచారంలో తాను జూనియర్ తో కలిసి ఎన్నికల ప్రచారంలో పాల్గొన్న విషయాలను గుర్తుకు చేసుకుంటూ ఖమ్మం సభ తరువాత తనకంటే ముందుగా జూనియర్ తన కారులో వెళ్ళిపోయిన తరువాత తాను వేరే కారులో వెళ్ళిన విషయాన్ని గుర్తుకు చేసుకున్నాడు. అయితే సూర్యాపేట దగ్గర జూనియర్ కు ప్రమాదం జరిగిందని తాను తెలుసుకుని అందరికంటే తాను ముందుగా యాక్సిడెంట్ స్పాట్ కు వెళ్ళి జూనియర్ ను లేపి పట్టుకుని తనకారులో ఉన్న టవల్ తో రక్తం మరింత పోకుండా కట్టుకట్టిన విషయాన్ని బయటపెట్టాడు. ఆతరువాత సూర్యాపేట దగ్గరలో ఉన్న తన అక్క ఇంటికి జూనియర్ ను తీసుకు వెళ్ళి అక్కడ ఉన్న డాక్టర్ చేత కుట్లు వేయించి ఆతరువాత మాత్రమే తాము కిమ్స్ హాస్పటల్ కు తీసుకు వెళ్ళిన విషయాన్ని బయట పెట్టాడు.
ఈసంఘటన జరగడంతో ఒక జూనియర్ తో ఉండే ఒక సన్నిహిత వ్యక్తి తాను లెగ్ పెట్టడం వల్లే జూనియర్ కు యాక్సిడెంట్ అయింది అని కామెంట్స్ చేసినప్పుడు తనకు విపరీతమైన కోపం వచ్చి ‘నేను ఉండబట్టే తారక్ ప్రాణాలతో వచ్చాడు. లేకపోతే ఏమయ్యేదో’ అంటూ తాను చేసిన కామెంట్స్ ను కొందరు జూనియర్ కు వేరేవిధంగా చెప్పడంతో తనకు జూనియర్ కు గ్యాప్ ఏర్పడిన విషయాన్ని వివరించాడు. అయితే ఆతరువాత కొన్నిసంవత్సరాలు తరువాత తాను జూనియర్ ను కలిసిన విషయాన్ని వివరిస్తూ తనతో జూనియర్ సన్నిహితంగా మాట్లాడినా గతంలో తనపట్ల చూపించే ప్రేమ ఆమాటలలో తనకు కనపడక పోవడంతో తన పై ఇప్పటికీ జూనియర్ కొందరు చెప్పిన తప్పుడు మాటలకు ప్రభావితం అయ్యాడు అన్నఅభిప్రాయం కలిగింది అంటూ తనకు ఇప్పటికీ ఎప్పటికీ తారక్ ప్రియస్నేహితుడు మాత్రమే అంటూ ఆ ఇంటర్యూ ద్వారా మరొకసారి శ్రీనివాస రెడ్డి జూనియర్ సాన్నిహిత్యాన్ని తిరిగి పొందడానికి తనవంతు ప్రయత్నం చేసాడు..