మార్కెట్‌లోకి కొత్త రూ.1,000 నోటు?

0

 సోషల్ మీడియాలోకొత్త రూ.1,000 నోటు హల్చల్ చేస్తుంది……..

మోదీ సర్కార్ మళ్లీ రూ.1,000 నోట్లను మార్కెట్లోకి తీసుకువస్తోంది. ఆ నోటు ఈ విధంగానే ఉంటుంది. అనే వార్తలు ఇప్పుడు సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతున్నాయి. ఇందులో నిజమెంతో చూద్దాం..

  • కొత్త రూ.1000 నోటు మార్కెట్‌లోకి అంటూ ప్రచారం
  • సోషల్ మీడియాలో వైరల్ అవుతున్న కరెన్సీ నోటు
  • సరికొత్తగా నోటు డిజైన్

భారత్‌లో కరెన్సీ నోట్లపై ఎప్పటికప్పుడు వార్తలు గుప్పుమంటూనే ఉన్నాయి. గత కొంత కాలంగా రూ.2,000 నోట్లపై చాలా వార్తలు వినిపిస్తూ వస్తున్నాయి. ప్రభుత్వం రూ.2,000 నోట్లను రద్దు చేస్తోందంటూ ప్రచారం జరిగింది. అయితే ఇందులో నిజం లేదు. రూ.2 వేల నోట్ల గురుంచి ఆర్‌బీఐ స్పష్టతనిచ్చింది. అయితే ప్రస్తుత ఆర్థిక సంవత్సరంలో ఇప్పటిదాకా ఒక్క రూ.2,000 నోటును కూడా ముద్రించలేదని స్పష్టం చేసింది.

రూ.2,000 నోటు అలా వార్తల్లో నిలిస్తే.. ఇప్పుడు రూ.1,000 నోట్లు వైరల్ అవుతోంది. కేంద్ర ప్రభుత్వం ఈ రోజే మార్కెట్‌లోకి కొత్త రూ.1,000 నోటును తీసుకువస్తోందంటూ సోషల్ మీడియాలో తెగ ప్రచారం జరుగుతోంది. కరెన్సీ నోట్లు కూడా నెట్టింట్లో హల్‌చల్ చేస్తున్నాయి. అయితే ఇవ్వన్నీ ఫేక్ వార్తలు. రిజర్వు బ్యాంక్ ఆఫ్ ఇండియా (ఆర్‌బీఐ) కొత్తగా ఎలాంటి రూ.1,000 నోటును మార్కెట్‌లోకి తీసుకురాలేదు.

 

Leave a Reply