మన రఫేల్ మరింత శక్తిమంతం
*మన రఫేల్ మరింత శక్తిమంతం* *అధునాతన హ్యామర్ క్షిపణులను అమర్చాలని భారత్ నిర్ణయం* *ఫ్రాన్స్ నుంచి అత్యవసరంగా కొనుగోలు చేస్తున్న వాయుసేన* దిల్లీ: కొత్తగా ఐదు రఫేల్ యుద్ధవిమానాలు తన అమ్ములపొదిలో చేరుతున్న నేపథ్యంలో వాటి పోరాట సామర్థ్యాన్ని మరింత పెంచాలని భారత వైమానిక దళం నిర్ణయించింది. గాల్లో నుంచి భూతలంలోని లక్ష్యాలను ఛేదించగల కొత్త తరం క్షిపణి వ్యవస్థను దీనికి అమర్చాలని నిర్ణయించినట్లు సంబంధిత వర్గాలు తెలిపాయి. రఫేల్ యుద్ధవిమానంలో మీటియోర్, స్కాల్ప్ క్షిపణులు, మైకా…