*ఓయూ బీఈ, బీసీఏ, బీఫార్మా పరీక్షలు వాయిదా.. త్వరలో కొత్త తేదీలు
* ఉస్మానియా యూనివర్సిటీ కొన్ని పరీక్షలను వాయిదా వేసింది. త్వరలో కొత్త తేదీలను ప్రకటించనుంది. ఉస్మానియా యూనివర్సిటీ కొన్ని పరీక్షలను వాయిదా వేసింది. ఈ నెల 15, 16వ తేదీన జరగాల్సిన బ్యాచిలర్ ఆఫ్ ఇంజినీరింగ్, బీసీఏ, బీఫార్మా, బీహెచ్ఎంసీటీ, బీసీటీసీఏ పరీక్షలను వాయిదా వేస్తున్నట్లు ఉస్మానియా యునివర్సిటీ ఓ ప్రకటనలో వెల్లడించింది. కొన్ని అనివార్య పరిస్థితుల కారణంగా పరీక్షలను వాయిదా వేస్తున్నట్లు తెలిపింది. పరీక్ష తేదీలను తిరిగి త్వరలోనే ప్రకటిస్తామని పేర్కొంది. కాగా మిగతా పరీక్షలు నిర్ణయించిన షెడ్యూల్ ప్రకారం సెప్టెంబర్ 17నే యథావిధిగా జరగనున్నట్లు స్పష్టం చేసింది. విద్యార్థులు పూర్తి వివరాలకు వర్సిటీ అధికారిక వెబ్సైట్ https://www.osmania.ac.in/ చూడొచ్చు. అయితే యూజీసీ ఆదేశాలకు అనుగుణంగా అన్నీ వర్సిటీలు యూజీ, పీజీ చివరి సెమిస్టర్ పరీక్షలు నిర్వహించడానికి అన్నీ యూనివర్సిటీలు సిద్ధమవుతున్న సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలో ఉస్మానియా వర్సిటీ కూడా యూజీ పరీక్షలకు సంబంధించి షెడ్యూల్ విడుదల చేసింది. అయితే కొన్ని అనివార్య పరిస్థితుల కారణంగా కొన్ని పరీక్షలను వాయిదా వేస్తున్నట్లు ప్రకటించింది.