బిగ్ బాస్ ఫైనల్ ఓటింగ్.. ఒక్క క్లిక్‌తో ఓటు

బిగ్ బాస్ సీజన్ 3లో నామినేషన్స్, ఎలిమినేషన్స్ ప్రక్రియలు ముగిశాయి. ఆట అంతిమ ఘట్టానికి చేరుకుంది. ఫైనల్‌గా టాప్ 5 కంటెస్టెంట్స్‌గా శ్రీముఖి, వరుణ్, రాహుల్, అలీ, బాబా భాస్కర్‌లు నిలిచారు. మరి వీరిలో మీకు ఇష్టమైన కంటెస్టెంట్‌కి ఓటు వేసి విన్నర్‌ని చేయడం ఎలాగో తెలుసుకుందాం.
- బిగ్ బాస్ సీజన్ 3లో ముగిసిన ఎలిమినేషన్ నామినేషన్ ప్రక్రియలు
- టాప్ 5లో వరుణ్, శ్రీముఖి, బాబా, అలీ, రాహుల్
- రెండు ప్రక్రియల్లో ఓటింగ్
- హాట్ స్టార్, మిస్డ్ కాల్ ద్వారా మీకు ఇష్టమైన కంటెస్టెంట్‌కు ఓటు వేయొచ్చు
డైరెక్ట్‌గా ఫోన్ చేసి మిస్డ్ కాల్ ద్వారా ఓట్ వేసే అవకాశం ఉంది. ఇందుకోసం ఒక్కో కంటెస్టెంట్‌కి ఒక్కో నంబర్ ఇవ్వడం జరిగింది. ఇందులో ఒక్కో కంటెస్టెంట్‌కి ఒక్క మిస్డ్ కాల్ ద్వారా ఒక ఓటు వేయొచ్చు. రోజులో ఒక్కోనెంబర్ నుండి పది వరకూ ఓట్లు వేయొచ్చు. ఈ ఓట్లను సర్దుబాటు చేసుకునే వీలుంది. అంటే ఉదాహరణకు ఎలిమినేషన్‌లో ఐదుగురు ఉంటే ఐదుగురికి తలొక రెండు చొప్పున లేదా.. పది ఓట్లను ఒక్కరికే వేసుకునే వీలుంది. ఎవరికి ఎన్ని ఓట్లు వేయాలన్నది ఓటర్ నిర్ణయాన్ని బట్టి ఉంటుంది.
