అన్నవరంలో హైదరాబాద్ జంట ఆత్మహత్య

తూర్పుగోదావరి జిల్లా అన్నవరంలో దంపతులు ఆత్మహత్య చేసుకున్నారు. స్నేహా రెసిడెన్సీలో ఇద్దరు ఉరి వేసుకొని ప్రాణాలు తీసుకున్నారు. లాడ్జ్ సిబ్బంది ఫిర్యాదుతో రంగంలోకి దిగిన పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు ప్రారంభించారు. మృతదేహాలను పోస్ట్‌మార్టమ్ కోసం ప్రభుత్వ ఆస్పత్రికి తరలించి.. బంధువులకు సమాచారం అందించారు.
మృతులు హైదరాబాద్‌కు చెందిన పవన్, దివ్యలక్ష్మీగా గుర్తించారు. ఆర్థిక ఇబ్బందులతోనే ఆత్మహత్య చేసుకున్నట్లుగా తెలుస్తోంది. వీరికి ట్రావెల్స్ వ్యాపారంలో నష్టాలు రావడంతో ఆత్మహత్య చేసుకున్నట్లు పోలీసులు ప్రాథమికంగా నిర్థారించారు. అంతేకాదు ఘటనా స్థలంలో సూసైడ్ నోట్‌ను పోలీసులు స్వాధీనం చేసుకున్నట్లు తెలుస్తోంది. ఘటనకు సంబంధించిన పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.
Discover more from TeluguWonders
Subscribe to get the latest posts sent to your email.
