మే23 న కౌంటింగ్ కేంద్రం వద్ద జరిగిన మరో అద్భుతం..

ఏపీ అసెంబ్లీ ఎన్నికల్లో వైఎస్‌ఆర్సీపీ ప్రభంజనం సృష్టించింది. వైఎస్ జగన్‌మోహన్ రెడ్డి సునామీలో ప్రత్యర్థి పార్టీలన్ని కొట్టుకుపోయాయి.ఇది జగన్ సాధించిన అరుదైన రికార్డ్..అయితే అదే రోజు ఇంకొక అతను కూడా ఒక రికార్డుని సాధించాడు.
అతనే 🔹గోరంట్ల మాధవ్ :👉ఒకప్పుడు సీ. ఐ : ఆయన ఒకప్పుడు అనంతపూర్ సీఐ. సీ. ఐగా పనిచేస్తూ.. స్థానిక ఎంపీ జేసీ దివాకర్ రెడ్డికి సవాల్ విసిరి వార్తల్లోకెక్కిన వ్యక్తి. ఆ తర్వాత ఉద్యోగానికి రాజీనామా చేసాడు.
👉ఇప్పుడు హిందూపురం ఎంపీ: ఆతర్వాత వైసీపీలో చేరి హిందూపురం ఎంపీగా పోటీ చేసాడు. భారీ మెజార్టీతో గెలుపొందారు.
🔉Record : సీఐగా పనిచేస్తున్న సమయంలో తన పై అధికారి డీఎస్పీకి సెల్యూట్ చేసిన ఆ మాధవ్, ఇప్పుడు ఎంపీగా ఎన్నికై అదే డీఎస్పీనుంచి సెల్యూట్ తీసుకున్నాడు. 🔳ఈ అరుదైన రికార్డ్ ఫలితాల రోజున కౌంటింగ్ కేంద్రం వద్ద జరిగింది.బళ్ళు ఓడలవ్వటం అంటే ఇదేనేమో…
Discover more from TeluguWonders
Subscribe to get the latest posts sent to your email.
