తెలంగాణలో 3000 దాటిన కరోనా కేసులుతెలంగాణలో 3000 దాటిన కరోనా కేసులు

virus
*తెలంగాణలో 3000 దాటిన కరోనా కేసులు* హైదరాబాద్: తెలంగాణలో కరోనా వైరస్ కేసుల సంఖ్య రోజురోజుకూ పెరుగుతోంది. ఇవాళ కొత్తగా 129 కరోనా కేసులు నమోదయ్యాయి. ఇందులో జీహెచ్‌ఎంసీ పరిధిలో అత్యధికంగా 108 కేసులు నమోదు కాగా.. ఇతర రాష్ట్రాల నుంచి వచ్చిన వారిలో ఇద్దరికి కరోనా నిర్ధరణ అయ్యింది. దీంతో రాష్ట్రంలో మొత్తంగా కరోనా కేసుల సంఖ్య 3020కు పెరిగింది.ఇప్పటివరకు రాష్ట్రంలో కరోనా నుంచి కోలుకొని 1556 మంది వివిధ కొవిడ్ ఆస్పత్రుల నుంచి డిశ్చార్జి అయ్యారు. 99 మంది వ్యాధి బారిన పడి మరణించారు. ప్రస్తుతం కరోనా కారణంగా చికిత్స తీసుకుంటున్న వారి సంఖ్య 1365గా ఉందని రాష్ట్ర వైద్య ఆరోగ్యశాఖ వెల్లడించింది.
Discover more from TeluguWonders
Subscribe to get the latest posts sent to your email.
