డిసెంబరుకల్లా
100% వ్యాక్సినేషన్
మంత్రి కేటీఆర్
ఈనాడు డిజిటల్, సిరిసిల్ల: రాష్ట్రంలో ఈ ఏడాది చివరికల్లా వంద శాతం కరోనా టీకాల పంపిణీ (వ్యాక్సినేషన్ పూర్తిచేస్తా మని మంత్రి కె. తారక రామారావు పేర్కొ న్నారు. ఇందుకోసం ప్రభుత్వం కోటి వ్యాక్సిన్ల కొనుగోలుకు గ్లోబల్ టెండర్లను ఆహ్వానించినట్లు తెలిపారు. రాజన్న సిరిసిల్ల జిల్లా వేములవాడ పురపాలిక పరిధి తిప్పా పూర్ లో కొత్తగా నిర్మించిన వంద పడకల ఆసుపత్రిని శుక్రవారం ఆయన ప్రారంభిం చారు. ఈ సందర్భంగా కేటీఆర్ మాట్లా డుతూ ప్రపంచానికి అవసరమైన రెండు
రకాల టీకాలు రాష్ట్రంలో తయారవుతున్నా. వాటి ఉత్పత్తిలో 85 శాతం కేంద్ర ప్రభుత్వ ఆధీనంలో ఉన్నాయని తెలిపారు. కొనుగోలు చేద్దామన్నా కేంద్ర, రాష్ట్ర ప్రభు త్వాలకు ప్రైవేటుకు ధరల్లో వ్యత్యాసం
మిగిలిన 15 శాతం ఉత్పత్తినీ వ్యాక్సిన్ కంపెనీలు, ప్రైవేటు సంస్థలకు అమ్ముకునేందుకు ఇష్టపడుతు న్నాయని తెలిపారు. వ్యాక్సిన్ల కొనుగోలులో రాష్ట్రాల పాత్ర లేకుండా చేయడం ఇబ్బందికరంగా మారిందన్నారు. రాష్ట్రంలో కరోనా తీవ్రత ఇప్పుడి పుడే తగ్గుతోందని, ఒకవేళ పెరిగినా ఎదుర్కొ
మిగిలిన 15 శాతం ఉత్పత్తినీ వ్యాక్సిన్ కంపెనీలు, ప్రైవేటు సంస్థలకు అమ్ముకునేందుకు ఇష్టపడుతు న్నాయని తెలిపారు. వ్యాక్సిన్ల కొనుగోలులో రాష్ట్రాల పాత్ర లేకుండా చేయడం ఇబ్బందికరంగా మారిందన్నారు. రాష్ట్రంలో కరోనా తీవ్రత ఇప్పుడి పుడే తగ్గుతోందని, ఒకవేళ పెరిగినా ఎదుర్కొనేందుకు సిద్ధంగా ఉన్నామని చెప్పారు. ఇతర దేశాల్లో వైద్యవిద్య పూర్తిచేసి వచ్చినవారు రాష్ట్రం లోని ప్రభుత్వ ఆసుపత్రుల్లో సేవలందించేందుకు ముందుకు రావాలని మంత్రి పిలుపునిచ్చారు. కార్యక్రమంలో టెస్కాబ్ చైర్మన్ కొండూరి రవీం దర్రావు, జడ్పీ చైర్పర్సన్ న్యాలకొండ అరుణ, కలెక్టర్ కృష్ణభాస్కర్ తదితరులు పాల్గొన్నారు.