*బ్లాక్ ఫంగస్‌పై ఆయుష్ అస్త్రం*
*కొవిడ్ బాధితులకూ ఊరట*
*నివారణకు ఎక్కువ అవకాశాలు*
*చికిత్సలోనూ తోడ్పాటు*
*రోగ నిరోధక శక్తికి ఊతమిస్తుందంటున్న వైద్య నిపుణులు*
రాష్ట్రంలో కొవిడ్ కేసులు కొద్దిగా తగ్గుముఖం పడుతున్నా.. బ్లాక్ ఫంగస్(మ్యూకర్ మైకోసిస్) మాత్రం ఆందోళనకు గురిచేస్తోంది. కొవిడ్, బ్లాక్ ఫంగస్ చికిత్సల్లో ప్రధానంగా అలోపతి వైద్యంపైనే ఎక్కువగా ఆధారపడుతున్నారు. ఇదే సమయంలో ప్రత్యామ్నాయ వైద్యంలోనూ కొవిడ్, బ్లాక్ ఫంగస్‌లను ఎదుర్కొనే సమర్థమైన చికిత్సలున్నాయని నిపుణులు వివరిస్తున్నారు. కేంద్ర ఆయుష్ మంత్రిత్వశాఖతో పాటు రాష్ట్ర ఆయుష్ శాఖ కూడా ఈ మహమ్మారి వ్యాధులను నయం చేయడానికి అవసరమైన చికిత్స విధానాలను ఇటీవలే అందుబాటులోకి తెచ్చింది. ఆయుర్వేద, హోమియో, యునానీ వైద్యాల్లో కొవిడ్, మ్యూకర్ మైకోసిస్‌ల చికిత్స, నివారణకు సంబంధించి నిపుణులు ప్రత్యేక ఔషధాలను పరిచయం చేశారు. బ్లాక్ ఫంగస్‌పై ఆయుష్ బాగా పనిచేస్తోందని వారు చెబుతున్నారు. కొవిడ్ బాధితులకు కూడా ఈ వైద్య విధానాలు కచ్చితంగా ఊరటనిస్తాయని స్పష్టం చేశారు. రోగ నిరోధక శక్తిని పెంపొందించడం ద్వారా నివారణలోనే కాకుండా చికిత్సలోనూ తోడ్పాటునందిస్తాయని పేర్కొన్నారు. అలోపతి వైద్యాన్ని వినియోగిస్తూనే.. ఆయుష్ వైద్య విధానాలను కూడా అనుసరించవచ్చని తెలిపారు. ఎటువంటి దుష్ఫలితాలు ఎదురు కావని వివరించారు. అయితే ఏదిపడితే అది… ఎలాపడితే అలా కాకుండా తప్పనిసరిగా నిపుణులైన డాక్టర్ల సూచనలు తీసుకునే తగిన వైద్య పద్ధతులను నిర్ణయించుకోవాలని స్పష్టం చేస్తున్నారు. ఈ మూడు వైద్యవిధానాలపై నిపుణులు చెబుతున్న సమాచారంతో ‘ఈనాడు’ ప్రత్యేక కథనం.. *ఆయుర్వేదంలో దివ్యౌషధాలు* కరోనా వైరస్ లక్షణాలు స్వల్పంగా, మధ్యస్థంగా ఉన్న రోగులకు దివ్యంగా ఉపయోగపడే ఔషధం ఆయుష్-64. ఈ మాత్రను 15 రోజుల పాటు ఉదయం ఒకటి, రాత్రి ఒకటి చొప్పున వాడాలి. దీన్ని కేంద్ర ఆయుష్ మంత్రిత్వ శాఖ ఆమోదించింది. బ్లాక్ ఫంగస్‌పై ఆయుష్ అస్త్రం *కబాసుర కుడినీర్:* ఇది ఒక సిద్ధ ఔషధం. ఇందులో 13 రకాల మూలికలుంటాయి. ఇది పొడి రూపంలో ఉంటుంది. ఒక స్పూను పొడి వేసి, 100మి.లీ. నీళ్లు పోసి, 50 మి.లీ. అయ్యే వరకూ బాగా కాచి, కషాయం మాదిరిగా చేసుకొని ఉదయం ఒక సగం అంటే 25 మి.లీ.. రాత్రికి మరో సగం తాగాలి. ఇలా 15 రోజుల పాటు తాగాలి. దీన్ని కూడా కేంద్ర ఆయుష్ శాఖ సిఫార్సు చేసింది. ఇది రోగ నిరోధక శక్తిని పెంచడం ద్వారా స్వల్ప, మధ్యస్థ లక్షణాలున్న వారిలో బాగా పనిచేస్తుంది. బ్లాక్ ఫంగస్‌పై ఆయుష్ అస్త్రం
*శంషమని వటి:* ఇందులో ‘గూడూచీ’ అనేది ప్రధాన ఔషధంగా ఉంటుంది. దీన్ని 500 మిల్లీ గ్రాములు ఉదయం, రాత్రి ఒక్కటొక్కటి చొప్పున 21 రోజుల పాటు వేసుకోవడం వల్ల రోగ నిరోధక శక్తిని మరింత బలోపేతం చేస్తుంది. కొవిడ్‌లో ఏ అవయవాలైతే ఎక్కువగా దుష్ప్రభావానికి లోనవుతాయో.. వాటిని ఈ ఔషధాలు బలోపేతం చేస్తాయి. ముఖ్యంగా ఊపిరితిత్తులకు బలం చేకూర్చుతాయి. బ్లాక్ ఫంగస్‌పై ఆయుష్ అస్త్రం
*అశ్వగంధ:* 500 మి.గ్రా. ఈ మాత్రను ఉదయం, సాయంత్రం ఒకటి చొప్పున 15-20 రోజుల పాటు వాడాలి. *బ్లాక్ ఫంగస్‌కు..* బ్లాక్ ఫంగస్‌ను తొలిదశలో గుర్తించకపోతే.. చాలా త్వరగా ఇతర అవయవాలకు వ్యాప్తి చెందుతుంది. అత్యవసర పరిస్థితుల్లో శస్త్రచికిత్స చేయాల్సి వస్తుంది. అందుకే కొవిడ్ సోకి తగ్గిన వారు, మధుమేహులు కొన్ని ఆయుర్వేద ఔషధాలను 21 రోజుల పాటు వాడుకోవడం ద్వారా బ్లాక్ ఫంగస్‌ను నివారించవచ్చని నిపుణులు సూచిస్తున్నారు. అలోపతి మాత్రలు అప్పటికే ఏమైనా వాడుతుంటే.. వాటిని కూడా వీటితో పాటు వేసుకోవచ్చు. అయితే అలోపతి, ఆయుష్ మాత్రలకు మధ్య 45 నిమిషాల వ్యవధి ఉండేలా చూసుకోవాలి. * శంషమని వటి: 500 మి.గ్రా. మాత్రను ఉదయం, రాత్రి ఒక్కొక్కటి భోజనం తర్వాత వేసుకోవాలి.
* నిషామలకి వటి: 500 మి.గ్రా. మాత్రను ఉదయం, రాత్రి ఒక్కొక్కటి వాడుకోవాలి. * సుదర్శన ఘన వటి: 500 మి.గ్రా. మాత్రను ఉదయం, రాత్రి ఒకటి చొప్పున వాడాలి. * ఆయుష్ 64: ఉదయం, రాత్రి ఒకటి చొప్పున 15 రోజులు పాటు వాడితే సరిపోతుంది. దీనివల్ల రోగ నిరోధక శక్తి పెరుగుతుంది.
*ఆహార నియమాలూ ముఖ్యమే* కొవిడ్ వచ్చి తగ్గిన తర్వాత.. వారిలో రోగ నిరోధక శక్తి తగ్గుతుంది. అందుకే అలోపతి మందులు కూడా వాడుతూ.. వీటిని అదనంగా వాడాలి. ఇతర ఆహార, వ్యాయామ నియమాలు పాటించడం ద్వారా రోగ నిరోధక శక్తి గణనీయంగా పెరుగుతుంది.
* గోరు వెచ్చని నీటిని తాగాలి. * వేడిగా ఉన్నప్పుడు ఆహార పదార్థాలు తీసుకోవాలి. * తేలికగా జీర్ణమయ్యేవి తినాలి. * దానిమ్మ, ద్రాక్ష, బత్తాయి, బొప్పాయి, జామ, ఖర్జూర తదితర పండ్లను తీసుకోవాలి. వీటిని ఫ్రిడ్జ్‌లో నిల్వ చేయొద్దు.
* రోజుకు 2 సార్లు ఆవిరి పట్టాలి. * చల్లనివి, శీతల పానీయాలు వద్దు. * బేకరీ, నిల్వ ఆహారాలను తినొద్దు. * చల్లని గాలిలో తిరగొద్దు. ఏసీ, కూలర్‌లకు కూడా దూరంగా ఉండాలి..
డాక్టర్ పెరుగు శ్రీకాంత్ బాబు ప్రధానాచార్యులు, ప్రభుత్వ ఆయుర్వేద వైద్యకళాశాల, హైదరాబాద్
*హోమియోతో అడ్డుకట్ట* కొవిడ్ నివారణకు హోమియో వైద్యంలో ‘ఆర్సెనిక్ ఆల్బ్’ 30 పొటెన్సీ బాగా పనిచేస్తుంది. దీన్ని రోజుకు 2 సార్లు వాడాలి. ప్రతిసారి కూడా 6 పిల్స్ వేసుకోవాలి. 3 రోజులు వినియోగించడం ద్వారా ఈ ఔషధం ‘యాంటీ కొవిడ్’గా ఉపయోగపడుతుంది. ఇది నివారణలో ఎక్కువగా పనిచేస్తుంది. *మ్యూకర్ మైకోసిస్‌కు…* * ఆర్సెనిక్ ఆల్బ్ 200 పొటెన్సీ: బ్లాక్ ఫంగస్ నివారణకు 6 పిల్స్ ఉదయం, సాయంత్రం రోజూ 2 డోసుల చొప్పున 5 రోజులు వాడాలి. * ఫైవ్‌ఫాస్ 6 ఎక్స్ టానిక్: రోజుకు 2 సార్లు 10 ఎంల్ చొప్పున 30 రోజుల పాటు వినియోగించాలి. * అదే చికిత్సలో అయితే ఈ కింది మందులను రోజుకు 2 సార్లు 200 పొటెన్సీలో 6 పిల్స్‌ను ఐదు రోజులు వరకూ వాడాలి. * తల భాగంలో నొప్పి ఉంటే.. క్యాలీబిచ్, మెర్క్ అయోడ్ రుబ్రామ్, మెర్క్ అయోడ్ ఫ్లేవమ్, మెర్క్‌సాల్, సిన్నబారిస్, తూజా, శ్వాసకోశాల్లో మ్యూకర్ మైకోసిస్ ఉంటే.. ఆర్సెనిక్ ఆల్బ్, ఫాస్ఫరస్, బ్రయోనియా, కార్బో అనిమలిస్ * చర్మంపై వస్తే.. ఆర్సెనిక్ ఆల్బ్, సల్ఫర్, మెర్క్‌సాల్, అంత్రాసినమ్ * జీర్ణకోశంలో కనిపిస్తే.. ఆర్సెనిక్ ఆల్బ్, ఫాస్ఫరస్, నైట్రిక్ యాసిడ్ * బాగా నీరసం, బలహీనపడడం, రోగ నిరోధక శక్తితగ్గిపోవడం వంటి లక్షణాలు కనిపిస్తే.. ఫైవ్‌ఫాస్ 6ఎక్స్ అనే మందును ఉదయం 3 గోలీలు, సాయంత్రం 3 గోలీలు 15-20 రోజుల వరకూ వాడుకోవాలి. _-డాక్టర్ ఎన్.లింగరాజు, ప్రధానాచార్యులు,_ *ప్రభుత్వ హోమియో వైద్యకళాశాల, హైదరాబాద్*
బ్లాక్ ఫంగస్‌పై ఆయుష్ అస్త్రం మూలికలతోనూ నయం కొవిడ్ చికిత్సలో గానీ, బ్లాక్ ఫంగస్‌లో గానీ మూలికా వైద్యంతో నివారణ సాధ్యమవుతుంది. రోగ నిరోధక శక్తిని పెంపొందిస్తే వ్యాధి సోకినా కూడా త్వరగా నయమవుతుంది.
* తిరాఖ్-ఈ-అజమ్: శరీరంపై ఎక్కడ సమస్యగా అనిపిస్తే అక్కడ బాహ్యంగా వాడుకోవచ్చు. ఉదాహరణకు జలుబు, దగ్గు, శ్వాసలో ఇబ్బంది వంటివి కనిపిస్తుంటే.. దీన్ని ముక్కు దగ్గర పెట్టుకోవచ్చు. రెండు చుక్కలను వేణ్నీళ్లలో వేసుకొని ఆవిరి కూడా పట్టొచ్చు.
* సుఫూఫ్-ఎ-గౌజబాన్: ఇది రోగ నిరోధక శక్తిని పెంచుతుంది. ఉదయం, సాయంత్రం 5 గ్రాములు తీసుకోవాలి. ఇప్పుడిది మాత్రగా అందుబాటులో ఉంది. మధుమేహులు, అధిక రక్తపోటుతో బాధపడుతున్నవారు, గుండె దడ ఉన్నవారు తీసుకోవడం ద్వారా మంచి ఫలితం లభిస్తుంది.
* ముసాఫియా-ఎ-ఖూన్: ఇది రక్త శుద్ధికి బాగా ఉపయోగపడుతుంది. యాంటీ ఇన్‌ఫ్లమేటరీగా, యాంటీ బయాటిక్‌గా, యాంటీ పైరెటిక్‌గా, యాంటీ ఫంగస్ ఔషధంగా కూడా పనిచేస్తుంది. జ్వరాన్ని నియంత్రిస్తుంది. శరీరంపై బాహ్య వాపు, శరీరం లోపల అంతర్గతవాపు కూడా దీని వల్ల తగ్గుతుంది. దీన్ని కొవిడ్ బాధితులు, బ్లాక్ ఫంగస్ బాధితులు కూడా వాడుకోవచ్చు. కొవిడ్ నుంచి కోలుకున్న వారు దీన్ని వాడడం వల్ల బ్లాక్ ఫంగస్ బారినపడకుండా అడ్డుకోవచ్చు. _-డాక్టర్ మాకుల మురళి, సీనియర్ వైద్యాధికారి_ _ప్రభుత్వ యునానీ ఔషధ ఉత్పత్తి కేంద్ర కర్మాగారం ఇన్‌ఛార్జి