*కరోనా మృతులు 20 లక్షలకు చేరొచ్చు: డబ్ల్యూహెచ్ఓ*
జెనీవా: కరోనా మహమ్మారిని ఎదుర్కోవడానికి ప్రపంచదేశాలు కలిసికట్టుగా చర్యలు తీసుకోవాలని, లేనట్లయితే కరోనా మృతులు 20 లక్షలకు చేరే అవకాశం అధికంగా ఉందని ప్రపంచ ఆరోగ్య సంస్థ (డబ్ల్యూహెచ్ఓ) హెచ్చరించింది.
ఇప్పటికే పది లక్షల మరణాలకు చేరువలో ఉన్నామని, వైరస్ వల్ల మరో పది లక్షల మంది మృతిచెందడానికిముందే ఈ సంక్షోభాన్ని పరిష్కరించడానికి ప్రపంచదేశాలు కలిసిరావాలని సూచించింది.
అసలు పది లక్షలమంది చనిపోవడమనేదే ఊహించలేని సంఖ్య అని, అది మరో పది లక్షలకు చేరకముందే పరిగణలోకి తీసుకోవాల్సిన అవసరం ఉందని డబ్ల్యూహెచ్ఓ ఎమర్జెన్సీస్ డైరెక్టర్ మైఖేల్ ర్యాన్ అన్నారు. గతేడాది డిసెంబర్‌లో చైనాలో ప్రారంభమైన కరోనా ఉత్పాతం ప్రపంచాన్ని వణికిస్తున్నది.
ఇప్పటికే ఈ మహమ్మారి వల్ల 9.88 లక్షమంది మృతిచెందారు. ఇప్పటివరకు 3.24 కోట్ల మంది కరోనా బారినపడ్డారు.