అపరిశుభ్రత వల్లే భారత్లో కరోనా తగ్గింdi

Spread the love

ప్రపంచదేశాలన్నీ కరోనా మహమ్మారితో విలవిలలాడుతున్నాయి. వ్యాక్సిన్ కోసం ప్రజలంతా ఎదురుచూస్తున్నారు. ఈ క్రమంలో మనదేశంలో కేసుల సంఖ్య క్రమంగా తగ్గుతున్నది.

భారతదేశంలో కరోనాను తట్టుకొనే ఇమ్యూనిటీ పెరిగిందని శాస్త్రవేత్తలు చెబుతున్నారు. ఇండియాలో కరోనా ఎలా అదుపులోకి వచ్చింది అనే విషయంపై సెంటర్ ఫర్ సైంటిఫిక్ అండ్ ఇండస్ట్రియల్ రీసెర్చ్ (CSIR)లోని భారతీయ సైంటిస్టులు అధ్యయనం చేశారు. అయితే భారత్లో ఇప్పటికే పరిశుభ్రత చాలా తక్కువగానే ఉంటుంది. విదేశాలతో పోల్చుకుంటే భారతీయులకు నిర్లక్ష్యం ఎక్కువ. ఎక్కడ పడితే అక్కడ చెత్తను పారబోయడం ఇక్కడ కామన్.

అయితే ఈ అపరిశుభ్రత వల్లే భారత్లో కరోనా తగ్గిందని.. ప్రజల్లో ఇమ్యూనిటీ పెరిగిందని శాస్త్రవేత్తలు చెబుతున్నారు.

అత్యధిక జనభా ఉన్న భారత్లో శానిటైజేషన్ ప్రతి రోజు నిర్వహించడం సాధ్యం కాదు. అత్యంత జన సాంద్రత కలిగిన ప్రాంతాల్లో కాలుష్యమైన గాలినే పీలుస్తున్నారు. గాలి కాలుష్యం కారణంగా ప్రతి ఏడాదిలో సగటున 1.2 మిలియన్ల మంది భారతీయులు మృత్యువాత పడుతున్నారు.

కానీ అభివృద్ధి చెందిన దేశాలతో పోలిస్తే భారత్లో కరోనా కేసులు కరోనా మరణాల సంఖ్య చాలా తక్కువగా ఉన్నది. పారిశుధ్యం బాగుండి అభివృద్ధి చెందిన దేశాల్లో ఇన్ఫెక్షన్లు తగ్గినప్పటికీ అక్కడి ప్రజల్లో ఆటో ఇమ్యూనో డిజార్డర్లు అలెర్జీలు వంటి సమస్యలు అధికంగా పెరిగాయని అధ్యయనంలో గుర్తించారు. అయితే అభివృద్ధి చెందిన దేశాలతో పోలిస్తే భారత్లో కరోనా తీవ్రత చాలా తక్కువగా ఉన్నది. ఇందుకు కారణం ఇక్కడ పరిశుభ్రత లేకపోవడం వల్లే జనాల్లో ఇమ్యూనిటీ పెరిగిందని శాస్త్రవేత్తలు చెబుతున్నారు. పారిశుద్ధ్యం తక్కువగా ఉండటం వల్ల ప్రజల్లో కరోనా తట్టుకొనే ఇమ్యునిటీ వచ్చేసిందని శాస్త్రవేత్తలు అభిప్రాయపడుతున్నారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *