స్వచ్ఛ సర్వేక్షణ్‌ అవార్డు: మళ్లీ ఇండోర్‌కే

Spread the love

*స్వచ్ఛ సర్వేక్షణ్‌ అవార్డు: మళ్లీ ఇండోర్‌కే* దిల్లీ: వరుసగా నాలుగో ఏడాది స్వచ్ఛ సర్వేక్షణ్‌ అవార్డును ఇండోర్‌ దక్కించుకుంది. దేశ వ్యాప్త వార్షిక పరిశుభ్రత సర్వే ఐదో ఎడిషన్‌ ఫలితాలను ప్రధాని నరేంద్ర మోదీ ప్రకటించారు. దేశవ్యాప్తంగా 4,242 పట్టణాలు, 62 కంటోన్మెంట్‌ బోర్డుల్లో కేంద్రం సర్వే నిర్వహణ చేపట్టింది.

ఈ ఏడాది తొలి స్థానంలో ఇండోర్‌ నిలవగా.. రెండు, మూడు స్థానాలను సూరత్‌, నవీ ముంబయి సాధించాయి. ‘స్వచ్ఛ సర్వేక్షణ్’‌ మొదటి ఎడిషన్‌లో మైసూర్‌.. ఆ తర్వాత వరుసగా మూడేళ్లు ఇండోర్‌కు స్వచ్ఛ సర్వేక్షణ్‌ అవార్డు వరించింది.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *