హీరో నిఖిల్ ఈ మధ్య మంచి ఫామ్ లో ఉన్నాడు బ్యాక్ టు బ్యాక్ హిట్స్ తో దూసుకెళ్తున్నాడు. అందరూ హీరోల కాకుండా తనకంటూ సెపరేట్ రూట్ ను ఫాలో అవుతుంటాడు.
నిఖిల్ సిద్ధార్థ్ హీరోగా, రుక్మిణి వసంత్ హీరోయిన్ గా రూపొందుతున్న చిత్రం అప్పుడో ఇప్పుడో ఎపుడో. సుధీర్ వర్మ దర్శకత్వం వహించిన ఈ చిత్రాన్ని SVCC బ్యానర్‌పై BVSN ప్రసాద్ నిర్మించారు. తాజాగా ఈ చిత్రానికి సంబంధించిన టైటిల్‌ను ప్రకటించగా, తాజాగా టీజర్‌ను విడుదల చేశారు.
అప్పుడో ఇప్పుడో ఎప్పుడో’ టీజర్ చూస్తుంటే.. అందులో హీరో రేస్ కార్ డ్రైవర్ పాత్రలో కనిపించనున్నాడు. ప్రేమకథతో పాటు ఎగ్జైటింగ్ ఎలిమెంట్స్ కూడా ఉంటాయని తెలుస్తుంది. ఈ చిత్రాన్ని నవంబర్ 8న విడుదల చేయనున్నట్టు ప్రకటించారు.