యాక్టర్ కావాలనుకున్న వ్యక్తి డైరెక్టర్ అయ్యాడు.. ఇప్పుడు వరుస పెట్టి హిట్లు కొడుతున్నాడు…

Spread the love

ఆయన యాక్టర్ కావాలనుకున్నాడు కానీ డైరెక్టర్ అయ్యాడు. ఆయన మరెవరో కాదు…”పటాస్” తో మంచి డైరెక్టర్ గా పేరు తెచ్చుకున్న అనిల్ రావిపూడి. ఆయన మొదట్లో యాక్టర్ కావాలని ఇండస్ట్రీ కి వచ్చాడు కానీ విధి ఆయన్ని డైరెక్టర్ ని చేసింది . ఆయన డైరెక్షన్ ఎంత జాగ్రత్తగా చేస్తాడో నటన కూడా అంతే అద్భుతంగా చేస్తాడట, ఒకానొక సందర్భంలో అనిల్ తనలో ఉన్న నటన గురించి ఒక ఇంటర్వ్యూ లో ఇలా వెల్లడించారు. గతంలో తన కోసం తాను ఒక పాత్ర కూడా రాసుకున్నట్లు అతను వెల్లడించాడు.

అంతా అనుకున్న ప్రకారం జరిగితే అతను చాలా ఏళ్ల కిందటే నటుడిగా మారాల్సిందట. కానీ అది కాస్తా అటు ఇటుగా అయ్యి దర్శకుడు అవ్వాల్సి వచ్చిందని తెలిపారు.

👉ఇంతకీ ఏ సినిమాలో అనిల్ నటుడుగా ఎంట్రీ ఇవ్వాలి అనుకున్నారు అంటే తాను రైటర్ గా కెరియర్ స్టార్ట్ చేసిన” కందిరీగ ” సినిమాతోనే నటుడుగా పరిచయం అవ్వాలి అనుకున్నారట. 😃ఆ చిత్రంలో సప్తగిరి ‘యాడికిరా పొయ్యేది’ అంటూ చెప్పే డైలాగ్.. చాలా famous.. అతడి ఎపిసోడ్ కూడా భలే ఫన్నీగా ఉంటుంది. సినిమాలో ఆ కామెడీ బాగా పేలింది. నిజానికి ఈ కామెడి డైలాగ్అనిల్ తనకోసమే రాసుకున్నాడట, ఆ పాత్రని తనే చేస్తాను అని దర్శకుడు సంతోష్ తో అనిల్ చెప్పారట, అక్కడివరకు బాగానే ఉంది కాని మరుసటి రోజుకి ఎందుకో అనిల్ మనసు మారిపోయింది. తాను చేయనని చెప్పేసాడంట. దాంతో సప్తగిరి ని దింపి ఆ scene ని పండించారంట. అదీ విషయం . దర్శకుడి గా ఫస్ట్ సినిమా నే ఆయన “పటాస్” లా పేల్చి.. ఇప్పుడు F2 సినిమాతో మోస్ట్ వాంటెడ్ డైరెక్టర్ గా మంచి పేరు సంపాదించుకున్నాడు అనిల్ రావిపూడి. అతని కెరియర్లో చేసినది నాలుగు సినిమాలే అయినా ఆ నాలుగు సినిమాలు కూడా హిట్ ట్రాక్ లో నిలిచాయి. 🔅ముఖ్యంగా చెప్పుకోవాలి అంటే “F2” అయితే బాక్స్ ఆఫీస్ దగ్గర బ్లాక్ బస్టర్ గా నిలిచింది. ఇంతటి విజయాన్ని సొంతం చేసుకుంటుందని వారు కూడా ఊహించలేదట. మొత్తానికి తెలుగు ఇండస్ట్రీ లో అనిల్ మోస్ట్ వాంటెడ్ డైరెక్టర్ అయిపోయాడు. 🌟నిజానికి అనిల్ రావిపూడి చూడడానికి డైరెక్టర్ లా అనిపించినా అతనిలో హీరో లక్షణాలు ఎక్కువగా కనిపిస్తాయి అని ఫిలిం సిటీ లో టాక్…ఏది ఏమైనా ఒక్కోసారి తప్పులు కూడా తమ మంచికే జరుగుతాయని..అనిల్ రావిపూడి విషయంలో మరోసారి రుజువు అయ్యింది.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *