మన్యం పులి మొదలైన బ్లాక్ బస్టర్ సినిమాలతో ఇటీవలి కాలంలో మలయాళ మెగాస్టార్ మోహన్‌లాల్ బాక్సాఫీస్ దగ్గర మంచి విజయం సాధిస్తున్నారు. ఆయన సెలెక్టివ్ గా విభిన్నమైన కథలు, సరికొత్త కథాంశంతో ప్రేక్షకులకి మంచి వినోదాన్ని అందిస్తున్నారు. ♦తాజాగా మోహన్ లాల్ .. పృథ్వీరాజ్ సుకుమార్ దర్శకత్వంలో లూసిఫర్ అనే చిత్రం చేశారు. ఆంటోనీ నిర్మించిన ఈ చిత్రంలో మోహన్ లాల్ సరసన మంజూ వారియర్ కథానాయికగా నటించింది. ఈ చిత్రంలో కీలకమైన పాత్రలో వివేక్ ఒబెరాయ్ నటించారు.. దీపక్ సంగీతాన్ని సమకూర్చారు. మార్చి 28న విడుదలైన ఈ చిత్రం కేవలం నాలుగు రోజులలో ప్రపంచ వ్యాప్తంగా 50 కోట్ల గ్రాస్ వసూళ్ళని రాబట్టి సంచలనం సృష్టించింది.
👉లూసిఫార్ రికార్డు ఇది : తాజాగా ఈ చిత్రం కేరళలో 6 రోజులకి 30కోట్ల గ్రాస్ వసూళ్లను రాబట్టి బాహుబలి 2 రికార్డు ను బ్రేక్ చేసింది. ఇంతకుముందు బాహుబలి 2 కేరళలో 7 రోజుల్లో 30కోట్లను రాబట్టింది. లూసిఫర్ చిత్రం ప్రపంచ వ్యాప్తంగా ఆరు రోజులకి గాను 78 కోట్ల గ్రాస్ వసూళ్లను రాబట్టిందని సమాచారం. పొలిటికల్ డ్రామాగా నిర్మితమైన లూసిఫర్ వంద కోట్ల మార్కుని సులువుగా అందుకుంటుందని అంటున్నారు.
👉రికార్డు బ్రేక్ చెయ్యడానికి కారణాలు ఇవే : వైవిధ్యభరితమైన కథాకథనాలు .. పాత్రల్లోని కొత్తదనం .. వాటిని మలిచిన తీరు ఈ సినిమాకి ఈ స్థాయి వసూళ్లను తెచ్చిపెడుతున్నాయని భావిస్తున్నారు. ఏది ఏమైనా రికార్డు ని తిరగరాసినట్టే మరి.