తాజాగా బైటకు వచ్చిన రానా లుక్ ఒకటి..చర్చనీయాంశమయ్యింది .ఆ ఫోటో లో ఆయన లుక్ చూస్తుంటే మరోసారి తన సినిమాతో ప్రేక్షకులను మాయ చేయడం ఖాయం లా అనిపిస్తోంది. గతం లో పాత్రకు తగ్గట్టు శరీరాకృతిని మార్చుకోవడం అనేది హాలీవుడ్ లో ఎక్కువగా కనిపించేది. తర్వాత బాలీవుడ్ లో ఆమీర్ ఖాన్.. కోలీవుడ్ లో కమల్.. విక్రమ్ లాంటి వారు బాడీ ట్రాన్స్ ఫార్మేషన్స్ తో ప్రేక్షకులను షాక్ కు గురి చేసేవారు. ఇక ఈ ట్రెండ్ ను యమదొంగ తో ఎన్టీఆర్.. బాహుబలి తో ప్రభాస్.. రానాలు టాలీవుడ్ కు అలవాటు చేశారు. సినిమాకు తగ్గట్టు make over : సినిమా,సినిమాకు పాత్రకు తగ్గట్టుతన శరీరాన్ని మార్చుకుంటూ.. లుక్స్ లో మార్పులు చూపిస్తూ అందరినీ ఆశ్చర్యంలో ముంచెత్తుతున్నాడు.
భల్లాలదేవుడిగా భారీకాయంతో కనిపించిన రానా ఆ సినిమా తర్వాత మళ్ళీ సన్నగా మారిపోయాడు. ఎన్టీఆర్ బయోపిక్ సమయంలో స్లిమ్ అవతారంలో కనిపించి అందరికీ షాక్ ఇచ్చాడు. క్లీన్ షేవ్ తో మీసాలతో నారా చంద్రబాబు నాయుడు పాత్ర కోసం పూర్తిగా మారిపోయాడు. తాజాగా మరోసారి తన లుక్ ను మరోసారి మార్చుకున్నాడు. రానా తాజా గెటప్ : చాలా డిఫరెంట్ గా ఉంది. తెల్లవెంట్రుకలు కూడా ఉన్న పొడవాటి గడ్డం.. రింగుల జుట్టు.. కళ్ళజోడు ధరించి ఉన్నాడు. పూర్తిగా మాసిపోయిన బ్రౌన్ కలర్ లో ఉండే లూజ్ షర్టు వేసుకొని విక్రమ్ ‘శివపుత్రుడు’ గెటప్ ను గుర్తు తెస్తున్నాడు. అసలు ఈ ఫోటోను సడెన్ గా ఎవరికైనా చూపించి ఎవరో కనుక్కోమంటే వారు రానాను గుర్తు పట్టడం కష్టం.
రానా నటిస్తున్న ‘హాథీ మేరె సాథీ’ కోసం ఈ గెటప్ లో ఉన్నాడని అంటున్నారు. దర్శకుడు ప్రభు సాలమన్ . అడవి నేపథ్యంలో తెరకేక్కే ఈ సినిమాలో రానాకు ఒక ఏనుగుకు మధ్య ఉన్న అనుబంధం పై కథ సాగుతుందట. అందుకే ఏనుగులను మచ్చిక చేసుకోవడం కోసం రానా స్పెషల్ ట్రైనింగ్ కూడా తీసుకున్నాడట. Hats off రానా…
Discover more from Telugu Wonders
Subscribe to get the latest posts sent to your email.