బిగ్‌బాస్ పునర్నవి లైఫ్‌ హిస్టరీ !!!

Bigboss Revival Life History
Spread the love

Teluguwonders:

పునర్నవి భూపాలం బిగ్‌బాస్ హౌస్‌లో అందాల ఝంకారం. తెలుగు బిగ్‌బాస్ హౌస్‌లోకి తొమ్మిదవ కంటెస్టెంట్‌గా టాలీవుడ్ నటి పునర్నవి భూపాలం ఎంట్రీ ఇచ్చింది. పునర్వవి తెలుగు అమ్మాయి కావడం విశేషం. ఆమె మే 28, 1996 న ఆంధ్రప్రదేశ్‌లోని గుంటూరు జిల్లా తెనాలిలో భాగ్యలక్ష్మి, నాగేష్ కుమార్ భూపాలం దంపతులకు జన్మించింది. ఆమెకు ఒక అక్క మేఘనా మరియు తమ్ముడు మోహిత్ ఉన్నారు. విజయవాడలోని కెన్నెడీ ఇంటర్నేషనల్ పాఠశాలలో ఆమె 10 తరగతి వరకు చదువుకుంది. పునర్వవి చిన్నప్పటి నుంచే నటన మీదు ఆసక్తిగా ఉండేది.

ఈ క్రమంలోనే హైస్కూల్ లెవల్‌లోనే ఎన్నో స్టేజ్ పెరఫామెన్స్ ఇచ్చింది. పదో తరగతి తర్వాత హైదరాబాద్‌కు షిప్ట్ అయిన పునర్నవి ఇక్కడే డిగ్రీ విద్యను అభ్యసించింది.

ఆ తర్వాత నటననే కెరీర్‌గా ఎంచుకున్న ఆమె థియేటర్ ఆర్ట్స్ యాక్టింగ్ స్కూల్‌లో శిక్షణ పొందింది. 2013లో విజయవాడలో జరిగిన అందాల పోటీలలో ఫ్రెష్ ఫేస్ ఆఫ్ విజయవాడ టైటిల్‌ను సొంతం చేసుకుంది. అష్టా చమ్మా చిత్రంతో ప్రారంభించిన ఆమె ప్రయాణం ‘ఉయ్యాల జంపాల’ చిత్రంలో సెకండ్ హీరోయిన్‌గా నటించి ప్రేక్షకులను మెప్పించింది. ఈ సినిమాలో పునర్నవి చేసిన సునీత పాత్రను ఎప్పటీకి ఎవ్వరూ మరచిపోలేరు.

నిజానికి ఒక్క ఉయ్యాల జంపాల సినిమాతో పలు చిత్రాల్లో నటించి తెలుగు ప్రేక్షకుల ఆదరాభిమానాలు పొందింది. మొదటి చిత్రంలోనే తన విశ్వరూపం చూపించిన పునర్నవి ఆ తర్వాత తిరుగులేకుండా దూసుకుపోయింది. `మళ్ళీ మళ్ళీ ఇది రాని రోజు` లో శర్వానంద్ కూతురు పార్వతిగా ఆమె చూపించిన నటన ఎన్నో ప్రశంసలు అందుకుంది. 2018లో వచ్చిన మనసుకు నచ్చింది అనే సినిమాలో తన నటనలో మరో కోణాన్ని చూపించింది. పిట్టగోడ చిత్రం ఆమె నటన చతురతకు మంచి ఉదాహరణ. అయితే ఇవన్నీ ఒక ఎత్తు అయితే ఉయ్యాల జంపాల ఆమె కెరీర్‌లోనే దీ బెస్ట్‌గా నిలిచింది.

మొదటి నుంచి పొదుపైన డ్రస్సులతో యువ ప్రేక్షకులని అలరించింది. ఇటు బిగ్‌బాస్ హౌస్‌లో తన వ్యక్తిత్వంతో హీటెక్కిస్తోంది. తొలి వారంలోనే ఎలిమినేషన్‌లో ఉండడంతో ఆ తర్వాత తీరు మార్చుకుని అందరితో కలిసిపోయింది. పొట్టి పొట్టి మాటలతో గ్లామర్‌ను.. చిట్టి పొట్టి మాటలతో గ్రామర్‌ను ఉలికిస్తూ పలికిస్తూ యువ ప్రేక్షకులను ఆకట్టుకుంటోంది. కొన్ని కొన్ని సందర్భాల్లో నేనింతే అంటూ చేసిన సంఘటన అంతా ఇంతా కాదు. అయితే తర్వాత వారాల్లో కూడా తననే టార్గెట్ చేసి నామెనేట్ చేయడంతో తన విశ్వరూపాన్ని చూపించి ఫైర్ అయిపోయింది. బిగ్‌బాస్ హౌస్‌లో అందరిని ఒక ఆట ఆడుకుంది. అయితే ఇంత చేసినా ప్రేక్షకుల్లో వ్యతిరేఖత లేకుండా అమె అందానికి ఆకర్షితులై యడా పెడా ఓట్లు వేసేస్తున్నారు. ఇది పునర్నవి లైఫ్ స్టోరీ..

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *