Teluguwonders:
బిగ్‌బాస్‌లో నాలుగో వారానికి సంబంధించిన నామినేషన్ల ప్రక్రియ ప్రారంభమైంది. ఈ సారి ఇంటి సభ్యులకు షాకిస్తూ బిగ్‌బాస్ కొత్తగా ప్రక్రియను మొదలుపెట్టి వారి మధ్య చిచ్చుపెట్టే ప్రయత్నం చేశారు. నామినేషన్ విషయంలో శివజ్యోతి, రోహిణికి బిగ్‌బాస్ షాకిచ్చాడు.
💕ఇంటిలో వరుణ్ సందేశ్, వితిక చిలిపి చేష్టలు, రొమాన్స్ ఆకట్టుకొన్నది. 👉అంతేకాకుండా ఈద్ వేడుకను నిర్వహించి సోమవారం ఎపిసోడ్‌కు ముగింపు పలికారు. ఇంటి సభ్యుల గురించి వివరంగా చెప్పాల్సి వస్తే..
🧡వరుణ్, వితిక్ సాఫ్ట్ రొమాన్స్ :
ఇంటిలోని బెడ్‌పై పడుకొని వరుణ్, వితిక్ సాఫ్ట్‌గా రొమాన్స్ చేశారు. తనను పట్టించుకోవడం లేదని వితిక కంప్లయింట్ చేయగా,.. అలాంటిదేమి లేదని వరుణ్ చెప్పాడు. నీవు ఎందుకు శ్రీముఖికి దూరంగా ఉంటున్నావని అడిగితే.. ఆమెతో నాకు ఎలాంటి ఇబ్బంది లేదని చెప్పారు. అలా ముద్దు, మురిపెంతో లైట్‌గా రొమాన్స్ చేశారు. అటువైపుగా వచ్చిన రాహుల్ డిస్ట్రబ్ చేయడం ఇష్టం లేదని అక్కడి నుంచి వెళ్లిపోయారు.
👉వంట పై రచ్చ :
ఇంటిలో వంట, ఇతర పనుల కేటాయింపుపై సభ్యుల మధ్య చర్చ జరిగింది. గత మూడు వారాలుగా వంటపని చేస్తున్న బాబా భాస్కర్‌ను తప్పించే విషయంలో కొంత వాగ్వాదం జరిగింది. మహేష్ విట్ట నేను వంట చేయగలను కాబట్టి కిచెన్‌లో పనిచేస్తానని చెప్పారు. అలా తమ పనులను ఒకరికొకరు కేటాయించుకొన్నారు.
🔴నామినేషన్ ప్రక్రియ :
ఇక నామినేషన్ ప్రక్రియ మొదలుపెట్టి.. ఇద్దరు సభ్యులను కన్ఫెషన్ రూమ్‌లోకి ఆహ్వానించాడు. ముందుగా రవికృష్ణ, వితిక వెళ్లారు. గతంలో టాస్క్ సంబంధించి ఇంటి ప్రాపర్టీని డామేజ్ చేసినందుకు నేను నామినేట్ చేసుకొంటానని, వితికను సేఫ్ చేశాడు. ఆ తర్వాత శివజ్యోతి, రోహిణి, మహేష్ విట్ట-వరుణ్ సందేశ్, రాహుల్-హిమజ వెళ్లి నామినేషన్ ప్రక్రియలో పాల్గొన్నారు.
💥ఈ వారం నామినేషన్‌లో :
గతవారం శ్రీముఖి నామినేట్ కాగా, పునర్నవి, అలి రజాలు సేఫ్ అయ్యారు. ఇక ఈ వారం నామినేషన్‌లో శివజ్యోతి, వరుణ్ సందేశ్, రాహుల్, బాబా భాస్కర్ తదితరులు నామినేట్ అయ్యారు. అయితే నామినేషన్ ప్రక్రియ సందర్భంగా నియామాలను ఉల్లంఘించినందుకు రోహిణిని కూడా నామినేట్ చేశాడు. అంతేకాకుండా వచ్చే వారం కూడా శివజ్యొతి, రోహిణిని నామినేట్ చేస్తూ బిగ్‌బాస్ షాకిచ్చాడు. దాంతో ఇద్దరూ కొంత నిరాశకు, అసంతృప్తికి లోనయ్యారు.
💓ఈద్ సెలెబ్రేషన్స్:
అలీ రజా హౌస్ లో.. ఈద్ వేడుకలను ప్రారంభించాడు. ఈద్ పాటకు డ్యాన్సులు చేస్తూ ఇంటి సభ్యులు ఆనందంగా గడిపారు.
🔵ఫ్యామిలీ ని తలుచుకుని ఉద్వేగం:
ఈద్ సందర్భంగా ఇంటి సభ్యులకు సంబంధించిన ఫ్యామిలీ ఫోటోలను చూపించడంతో కొంత భావోద్వేగానికి లోనయ్యారు. ఆ తర్వాత ఇంటి సభ్యులకు ఈద్ విందును ఏర్పాటు చేయగా హ్యాపీగా ఎంజాయ్ చేశారు. ఈద్ పాటకు డ్యాన్సులు చేస్తూ ఇంటి సభ్యులు ఆనందంగా గడిపారు.
👉వీళ్ళందరూ :
ఈద్ సందర్భంగా అలీ రజా, రోహిణి, శివజ్యోతి, రవికృష్ణ తమ కుటుంబాలను గుర్తు చేసుకొన్నారు. అంతేకాకుండా తమ తల్లిదండ్రులు ఎలా సపోర్ట్ చేశారనే విషయాన్ని చెప్పి కంటతడి పెట్టుకొన్నాడు. తన తండ్రికి దూరమైన విషయాన్ని తలుచుకొని దు:ఖంలో మునిగిపోయారు. తన తల్లిదండ్రులు విడిపోవడాన్ని గుర్తు చేసుకొని రోహిణి కంటతడి పెట్టారు.