బిగ్ బాస్ 3 : అషు రెడ్డి అందుకే ఔట్!

Bigg Boss 3: Ashu Reddy ​​Out!
Spread the love

Teluguwonders:

బిగ్ బాస్ 3 ఆదివారం ఎంతో సందడిగా సాగింది. అక్కినేని నాగార్జున ప్రతి వారం ఎంతో బాధకరంగా చెబుతన్న డైలాగ్ ఎలిమినేషన్. కానీ తప్పదు కదా..ప్రతి వారం ఒకరు ఎలిమినేట్ కావల్సిందే అంటూ ఎంట్రటైన్ చేస్తుంటారు. నిన్న కెప్టెన్ శివజ్యోతితో ఒక్కొక్కిరికీ మాస్క్ తొడిగించి వారు ఎందుకు అలా ఉండాల్సిందో వివరణ అడి ఒక పాటకు డ్యాన్స్ చేయించారు. ఇలా ఒక్కొక్కరికీ వారి క్యారెక్టర్స్ కి తగ్గట్టు మాస్క్ లు తొడిగించారు. టాస్క్ లు ఇచ్చి హౌస్ మేట్స్ ని ఆడిస్తూ.. మరోవైపు డేంజర్ జోన్‌లో ఉన్న ఐదుగురిలో ఒక్కొక్కరిని సేఫ్ జోన్‌లో వేస్తూ షోని ఆసక్తికరంగా నడిపించారు.

వరుణ్‌ సందేశ్‌ పునర్నవిలా.. పునర్నవి వరుణ్‌సందేశ్‌లా, రాహుల్‌లా శ్రీముఖి నటించి బాగా నవ్వించారు. ఒక్కొక్కరు సేఫ్ గురించి మాట్లాడుతూ నాగార్జున అందరినీ నవ్వించారు. వారాంతంలో నాగార్జున వచ్చి.. హౌస్‌మేట్స్‌ తో మాట్లాడుతూ.. కొన్ని హెచ్చరికలు, సూచనలు ఇవ్వడం చేస్తుంటాడు. ఈ మేరకు విడుదల చేసిన ప్రోమోలు సోషల్‌ మీడియాలో నెటిజన్లను ఆకర్షిస్తున్నాయి.

వరుణ్‌ సందేశ్‌ పునర్నవిలా.. పునర్నవి వరుణ్‌సందేశ్‌లా, రాహుల్‌లా శ్రీముఖి నటించడం ఫన్‌ను క్రియేట్‌ చేసేలా ఉంది.ఇక బాబా భాస్కర్‌కు తెలుగు సరిగా రాకపోవడంతో హౌస్‌మేట్స్‌ పేర్లను కరెక్ట్‌గా పలకలేకపోతున్నాడు. మధ్యమధ్యలో సేఫ్ జోన్ లో ఎవరెవరు ఉన్నారో అనౌన్స్ చేసిన నాగ్ ఫైనల్ గా అషురెడ్డి ఎలిమినేటెడ్ అని ప్రకటించారు. అయితే ఈ వారం ఇంటి నుండి వెళ్లేది ఎవరనే విషయంలో ఇప్పటికే లీకులు వచ్చాయి. దీంతో షోపై ఆసక్తి సన్నగిల్లుతుండడంతో హౌస్‌మేట్స్‌తో ఫన్నీ టాస్క్‌లు చేయించి వీక్షకులను ఎంటర్టైన్ చేస్తున్నారు.

హౌస్ నుండి వెళ్లిపోతూ జిగేలు రాణి పాటకు స్టెప్పులు వేసింది అషు రెడ్డి. ఆ తరువాత స్టేజ్ మీదకు వచ్చిన అషుకి నాగార్జున ఒక టాస్క్ ఇచ్చారు. కంటెస్టెంట్స్ అందరి అందరి ఫ్రేమ్ లు ఒక బోర్డ్ మీద పెట్టిన నాగ్ హౌస్ లో ఎవరుంటారని భావిస్తున్నావని అషుని అడగగా శివజ్యోతి, శ్రీముఖి, బాబా భాస్కర్, అలీ రెజా, వరుణ్ సందేశ్, రవికృష్ణల ఫ్రేమ్ లను మాత్రమే ఉంచి మిగిలిన వాళ్ల ఫ్రేమ్ లను పగలగొట్టింది. మొత్తానికి మొదటి నుంచి ఎంట్రటైన్ చేయలేక అషూ ఎలిమినేట్ అయ్యిందనే అంటున్నారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *