Teluguwonders:
‘జబర్దస్త్’ షోలో నటిస్తున్న కమెడియన్లు లక్షల్లో సంపాదిస్తున్నారని.. ఖరీదైన ఇల్లు, కార్లు కొనుకొన్ని విలాసవంతమైన జీవితం గడుపుతున్నారని వార్తలు వినిపించేవి. అందులో కొన్ని నిజాలు కూడా ఉన్నాయి. ‘జబర్దస్త్’ షోతో లక్షలు సంపాదించిన వాళ్లు ఉన్నారు. తాజాగా ఈ షోలో నటిస్తోన్న కమెడియన్ల పారితోషికాలు బయటకి వచ్చాయి.
వీటితో పాటు నాగబాబు, రోజాల రెమ్యునరేషన్స్ కూడా బయటకి వచ్చాయి. అన్నింటికంటే ఆశ్చర్యకరమైన విషయం ఏంటంటే..? జబర్దస్త్ షోకి క్రేజ్ తీసుకొచ్చి, యూట్యూబ్ లో తన వీడియోలకు విపరీతమైన డిమాండ్ తీసుకొచ్చిన హైపర్ ఆదికి.. మిగిలిన కంటెస్టంట్స్ తో పోలిస్తే తక్కువ రెమ్యునరేషన్ ఉన్నట్లు తెలుస్తోంది.
చమ్మక్ చంద్ర, సుడిగాలి సుధీర్ ల కంటే హైపర్ ఆది రెమ్యునరేషన్ తక్కువని సమాచారం.
చమ్మక్ చంద్ర, సుడిగాలి సుదీర్ రూ.4 లక్షల రూపాయల వరకు జీతం తీసుకుంటున్నారు. కానీ హైపర్ ఆదికి రూ.3 లక్షలు మాత్రమే ఇస్తున్నారు. గతంలో ఒక స్కిట్ కి ఇంత అని పారితోషికాలు ఉండేవి. అయితే అవన్నీ తీసేసి ఇప్పుడు నెలజీతం ఫిక్స్ చేశారు.
‘జబర్దస్త్’ టీంలో అతి తక్కువ జీతం రూ.75 వేలు కాగా.. కాస్త పేరున్న ఆర్టిస్ట్ లంతా కూడా రెండున్నర లక్షల జీతం తీసుకుంటున్నారు. యాంకర్లు, జడ్జిలు కూడా ఎక్కువ మొత్తాన్నే తీసుకుంటున్నారట. అనసూయకి నెలకి రూ.4 లక్షలు కాగా.. రష్మి నెలకి రూ.3 లక్షలు తీసుకుంటోంది. నాగబాబు నెలకి రూ.20 లక్షల వరకు తీసుకుంటున్నారట. రోజాకి రూ.15 లక్షలు ఇస్తున్నట్లు సమాచారం.