వాట్సాప్ యూజర్లు వామ్మో అనే వార్త…ఇది
ఇప్పటివరకూ వాట్సాప్ యాడ్ ఫ్రీ యాప్(ప్రకటనలు లేని యాప్)గా వినియోగదారులకు ఎన్నో సేవలు అందిస్తూ వస్తోంది. అయితే, ఇక నుంచి వాట్సాప్‌లోనూ ప్రకటనలు కనిపించనున్నాయి. వచ్చే ఏడాది నుంచి వాట్సాప్ స్టేటస్‌లో యాడ్స్ ఉంటాయట. ఇటీవల నెదర్లాండ్స్‌లో జరిగిన ఫేస్‌బుక్ మార్కెటింగ్ సదస్సులో ఈ వివరాలు వెల్లడయ్యాయి. 2020 నుంచి వాట్సాప్‌లో ప్రకటనలు వస్తాయి. వినియోగదారుల స్టేటస్‌లో అవి కనిపిస్తాయి అని ఈ సదస్సు హాజరైన ఓలివర్ అనే వ్యక్తి ట్వీట్ చేశాడు. వామ్మో అనిపిస్తుంది కదూ..