అలియా భట్, వేదాంగ్ రైనా జంటగా నటించిన జిగ్రా చిత్రం అక్టోబర్ 11న విడుదల కానుంది. మంగళవారం హైదరాబాద్‌లోని పార్క్ హయత్‌లో ప్రారంభోత్సవ కార్యక్రమం జరిగింది. దీనికి అలియా భట్, సమంత, రానా దగ్గుబాటి, త్రివిక్రమ్ శ్రీనివాస్, రాహుల్ రవీంద్రన్, వేదంగ్ రైనా హాజరయ్యారు.
ఈ సందర్భంగా సమంత మాట్లాడుతూ.. ” కథానాయికలకు చాలా బాధ్యత ఉంటుంది. ప్రతి ఆడపిల్ల కథలోనూ కథానాయిక అమ్మాయినే అంటున్నారు. చాలా రోజుల తర్వాత మీ ముందుకు వచ్చానని, జిగ్రా సినిమా పెద్ద బ్లాక్ బస్టర్ అవ్వాలని కోరుకుంటున్నాను అన్నారు. అలాగే ప్రతి అమ్మాయికి రానా లాంటి సోదరుడు ఉండాలని, తెలుగు ప్రేక్షకులే తన కుటుంబమని” సమంత తన మాటల్లో చెప్పుకొచ్చింది.
ఇదిలా ఉండగా వాసన్ బాలా దర్శకత్వంలో యాక్షన్ చిత్రం జిగ్రా. తమ్ముడి కోసం అక్క ఎలా పోరాటం చేస్తుందనేది ఈ సినిమా కథ.