ఎస్ పి బాల సుబ్రహ్మణ్యం ని డ్రీమ్ బాయ్ అన్న ఒక హీరోయిన్…

Spread the love

ఎస్పీ బాల సుబ్రహ్మణ్యం.. గాన గంధర్వుడు.. ఓ ఇరవయ్యేళ్ల క్రితం సినీ గాయకుడు అంటే ఎస్పీ బాలసుబ్రహ్మణ్యం మాత్రమే . మొత్తం తెలుగు సినీ పరిశ్రమలోని పాటల్లో దాదాపు 80 శాతానికి పైగా ఆయనే పాడేవారంటే అతిశయోక్తి లేదు.

👉హీరోల గొంతు మాడ్యులేషన్ ను బట్టి..వారికి అనుకూలంగా.. తెరపై వారే పాడారా అనిపించేలా పాడటంలో బాలూది ప్రత్యేక శైలి. అలాంటి బాలసుబ్రహ్మణ్యాన్ని అప్పట్లో ఓ హీరోయిన్ మై డ్రీమ్ బాయ్ అంటూ కామెంట్ చేసిందట. అలా బహిరంగంగా తన అభిమానాన్ని చాటుకుందట.

ఓ సంగీత కార్యక్రమంలో బాలు వేదికపై ఈ విషయాన్ని ప్రేక్షకులతో సరదాగా పంచుకున్నారు. ఇంతకీ ఆ హీరోయిన్ ఎవరో తెలుసా..

👉సుమలత : తెలుగులో హీరోయిన్ గా చాలా సినిమాలు చేసిన సుమలత ఆ తర్వాత కన్నడ హీరో అంబరీశ్‌ ను పెళ్లి చేసుకుని సినిమాలకు గుడ్‌ బై చెప్పారు.

ఇటీవలే ఆమె భర్త కన్నుమూశారు. ఆమె తన భర్త పోటీ చేసిన మాండ్య నుంచి లోక్‌సభకు పోటీ చేశారు.

👉సుమలత గురించి బాలు : ఆమె భర్త కన్నుమూసిన విషయాన్ని ప్రస్తావిస్తూ.. సుమలత జీవితం సాఫీగా సాగిపోవాలని ఆకాంక్షించారు బాలు. ఆమె రాజకీయాల్లోకి రాకుండా ఉంటే బావుండేదన్న బాలు.. తాను కోరుకున్న రంగంలో రాణించాలని కోరుకున్నారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *