బిగ్‌బాస్ నుంచి తమన్నా అవుట్ : గెస్ట్ గా వెన్నెల కిషోర్

Tamanna out of Bigbas: Vennela Kishore as guest
Spread the love

Teluguwonders:

బిగ్‌బాస్ రియాలిటీ షోలో మూడో పునర్నవి, బాబా భాస్కర్, తమన్నా, వితిక, రాహుల్ తదితరులు నామినేషన్‌లో ఉండటంతో ఎవరు అవుట్ అవుతారనే ఆసక్తి మధ్య ఫన్‌గా కార్యక్రమాన్ని హోస్ట్ అక్కినేని నాగార్జున ప్రారంభించారు. ఈ ఎలిమినేషన్‌ చాలా ఆసక్తి రేపింది.

🔴అంకితం నీకే అంకితం :

 వెన్నెల కిషోర్ ఎంట్రీ :

ఈ ఎపిసోడ్‌లో అంకితం నీకే అంకితం అనే గేమ్‌ను ఆడించారు. అలాగే వెన్నెల కిషోర్ బిగ్‌బాస్ వేదికపై మెరిసాడు.

👉వివరాల్లోకి వెళితే..:

అంకితం గేమ్‌తో నాగ్ బిగ్‌బాస్‌లో ఆదివారం ఎపిసోడ్‌లో చాలా ఫన్‌గా సాగింది. ఓ బాక్సులో చిట్టీలు వేసి.. వారికి తీసిన చిట్టీలో ఉండే పాటను ఇంట్లోని సెలబ్రిటీలకు అంకితం చేయాలి. అలా సాగిన ఎపిసోడ్‌లో మహేష్ విట్టకు వచ్చిన పాటను పునర్నవికి అంకితం చేశారు. గోవిందా గోవిందాలోని పాట చాలా వినోదాన్ని నింపింది. బాబా భాస్కర్‌కు ఎక్కువ మంది సెలబ్రిటీలు తమ పాటలను అంకితం చేశారు.

🔴ఎలిమినేషన్‌ ప్రక్రియ :

ఇక మూడోవారం ఎలిమినేషన్‌ ప్రక్రియలో భాగంగా రాహుల్ సిప్లిగంజ్, పునర్నవి మొదటి విడుతగా సేఫ్‌ అయ్యారు. అనంతరం కూడా అంకితం పాటల కార్యక్రమం సాగుతున్న సమయంలో వెన్నెల కిషోర్ ఇంట్లోని వేదికపైకి ప్రవేశించారు.

🔴 వెన్నెల కిషోర్ :

ఇక నాగ్‌తో కలిసి వెన్నెల కిషోర్ తనదైన శైలిలో వినోదాన్ని పంచారు. గేమ్‌లో భాగంగా ప్రతీ ఒక్కరి గురించి, వారి ఫెర్ఫార్మెన్స్ గురించి చెప్పి వారిలో సంతోషాన్ని పంచారు. మహేష్ విట్టను ఆప్యాయంగా పలుకరించారు. శ్రీముఖిని డార్లింగ్ అంటూ పలకరించి మా ఇంట్లో అందరూ మీకు ఫ్యాన్స్ అంటూ చెప్పారు. ఇలా ప్రతీ ఒక్కరి గురించి వారి పాజిటివ్ పాయింట్స్‌ను వెన్నెల కిషోర్ వెల్లడించారు. ఈ సందర్భంగా బాబా భాస్కర్‌ను ఎలిమినేషన్‌లో నుంచి సేఫ్ చేశారు. దాంతో ఎలిమినేషన్‌లో తమన్నా, వితిక మిగిలారు. వెన్నెల కిషోర్ ఇంట్లో నుంచి బయటకు వెళ్లిన తర్వాత మళ్లీ నామినేషన్‌ ప్రక్రియను మొదలుపెట్టారు.

🔴తమన్నా సింహాద్రి అవుట్ :

మిగిలిన ఇద్దరు తమన్నా, వితికలో ఎవరు సేఫ్ అవుతారని అడిగిన తర్వాత మెజారిటీ సభ్యులు సూచించిన ప్రకారం తమన్నా ఎలిమినేట్ అయ్యారనే హోస్ట్ నాగ్ ప్రకటించారు. అతి తక్కువ ఓట్లు వచ్చిన సెలబ్రిటీ తమన్నా కావడంతో ఎలిమినేట్ అయ్యారని చెప్పారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *