గత కొంత కాలం నుంచి బంగారం ధరలు పెరుగుతూనే ఉన్నాయి. గోల్డ్ కొనాలనుకొనేవారు కూడా పెరిగిన ధరలు చూసి వెనుదిరుగుతున్నారు. ఇది పండగ సీజన్. చాలా మంది గోల్డ్ కొనాలని ఆశ పడుతుంటారు. ముఖ్యంగా , మన దేశంలో ఇంట్లో శుభకార్యాలు జరిగినప్పుడు కానీ, పండగల సమయాల్లో బంగారం కొనుగోలు చేస్తుంటారు.
భారత దేశంలో మహిళలు ఇది సంప్రదాయంగా పాటిస్తుంటారు. పండగ సీజన్‌లో గోల్డ్ డిమాండ్ ఉన్నప్పటికీ.. రేట్లు అందర్ని షాక్ కు గురి చేస్తున్నాయి. గత రెండు నెలలుగా పసిడి సామాన్యులకు అందకుండా పోతుంది. యూఎస్ ఫెడ్ వడ్డీ రేట్లను తగ్గించినా కానీ, ఆ తర్వాత గోల్డ్ రేట్లు భారీగా పెరిగాయి. ఈ రోజు తెలుగు రాష్ట్రాల్లో గోల్డ్ ధరలు ఎలా ఉన్నాయో ఇక్కడ తెలుసుకుందాం..
హైదరాబాద్ లో 22 క్యారెట్ల బంగారం ధర తులం రూ. 70,990 గా ఉంది. ఇక 24 క్యారెట్స్ గోల్డ్ ధర 10 గ్రాములకు రూ. 77,440 గా ఉంది. ఇదే దేశ రాజధాని ఢిల్లీలో చూసినట్లయితే తులం గోల్డ్ రేటు 22 క్యారెట్లపై రూ. 71,140 వద్ద ఉండగా.. 24 క్యారెట్ల స్వచ్ఛమైన బంగారం రేటు రూ. 77,590 వద్ద ఉంది. హైదరాబాద్ నగరంలో కిలో వెండి ధర రూ. 1,01,900 గా ఉంది.
విజయవాడలో 22 క్యారెట్ల బంగారం ధర తులం రూ. 70,990 గా ఉంది. ఇక 24 క్యారెట్స్ గోల్డ్ ధర 10 గ్రాములకు రూ. 77,440 గా ఉంది.