Teluguwonders:
బిగ్ బాస్ కి లీకుల బెడద ఎక్కువైంది. రాత్రి వచ్చే ఎపిసోడ్ కాకుండా అన్ సీన్ అంటూ మరుసటి మార్నింగ్ టెలిక్యాస్ట్ అయినా కూడా ఇంకా మనకి తెలియని కంటెంట్ చాలా ఉందని ఈ లీకుల ద్వారా అర్థం అవుతుంది. ప్రస్తుతం ఒక వీడియో సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతుంది. మొన్నటి వరకు రాహుల్, పునర్నవి ల మధ్య లవ్ ట్రాక్ నడుస్తుందని అందరూ అనుమానిస్తున్నారు. రాహుల్ ఒక ఎపిసోడ్ లో డేట్ కి వస్తావా అని పునర్నవిని అడగడం ఈ అనుమానాలకి తావిచ్చింది.
అప్పటి నుండి వీరిద్దరి మీదా ప్రేక్షకులు ఒక కన్నేసి ఉంచారు. నాగార్జున కూడా ఒకానొక టైంలో ఈ విషయం గురించి రాహుల్ ని ఏడిపించాడు. మొన్న వెన్నెల కిషోర్ రాహుల్ గురించి చెబుతూ బయ్యా నీ గురించి బయట వేరేలా అనుకుంటున్నారు.
నువ్వు మాత్రం పులిహోర రెసిపీ కలుపుతున్నావని అన్నాడు. అయితే వీటన్నింటిని నిజం చేసేలా ఒక వీడియో బయటకి వచ్చింది. దానిలో రాహుల్ తాగిన కాఫీ కప్పును పునర్నవికి అందిస్తాడు. పునర్నవి దాన్ని అందుకుని సిప్ చేసి మళ్ళీ రాహుల్ కి ఇస్తుంది.
ఇదంతా చూస్తుంటే ఆ అనుమానాలన్నీ నిజం అయ్యాయనే అనిపిస్తుంది. బిగ్ బాస్ లో ఇటువంటి ట్రాక్ లు కొత్తేమీ కాదు. ఫస్ట్ సీజను నుండి వస్తున్నదే. అయితే దీని వల్ల బిగ్ బాస్ హౌస్ లో మిగతా కంటెస్టెంట్స్ కి నష్టం కలిగే అవకాశం లేకపోలేదు. పునర్నవితో స్నేహం వల్ల రాహుల్ చాలా ఇన్ ఫ్లూయెన్స్ అవుతున్నాడని వార్తలు వస్తున్నాయి. అందుకే పునర్నవికి నచ్చని ఇంటి సభ్యులతో రాహుల్ కూడా సరిగా ఉండడంలేదని టాక్.మరి ముందు ముందు ఎపిసోడ్ లలో ఈ ప్రేమ జంట వల్ల హౌస్ మేట్స్ లో ఎలాంటి మార్పు వస్తుందో చూడాలి