పసిడి రూ.50000 చేరువలో

*పసిడి రూ.50000 చేరువలో..* ముంబయి: సోమవారం ముంబయిలో 10 గ్రాముల పసిడి ధర రూ.50,000 చేరువకు వెళ్లింది. 24 క్యారెట్ల 10 గ్రాముల పసిడి ధర 3 శాతం జీఎస్‌టీతో కలుపుకొని రూ.49,749కు చేరింది. కరోనా వైరస్ కేసుల సంఖ్య పెరగడం కొనసాగుతున్న నేపథ్యంలో అంతర్జాతీయ పసిడి ధర తాజా నెల గరిష్ఠానికి చేరడంతో దేశీయంగా పసిడి పరుగులు తీస్తోంది. ఇక దేశ రాజధాని దిల్లీలో పసిడి 99.9 శాతం స్వచ్ఛత కలిగిన 10 గ్రాముల బంగారం ధర రూ.85 తగ్గి రూ.48,811 వద్ద ముగిసింది. డాలర్‌తో పోలిస్తే రూపాయి బలపడటం ప్రభావం చూపింది. ఇక కేజీ వెండి ధర రూ.144 లాభంతో రూ.49,880 దగ్గర ముగిసింది.
Discover more from TeluguWonders
Subscribe to get the latest posts sent to your email.
