హైదరాబాద్‌లో భారీ చోరీ.. 5.5కిలోల బంగారం ఎత్తుకెళ్లిన దొంగలు

5.5కిలోల బంగారం, 7కిలోల వెండితో పాటు రూ.18లక్షల నగదు చోరీకి గురైనట్లు సరళ ఫిర్యాదులో పేర్కొంది. అయితే బాధితురాలు ఫిర్యాదులో పేర్కొన్నట్లు అంత బంగారం, నగదు చోరీకి గురైందా? అని పోలీసులు అనుమానం వ్యక్తం చేస్తున్నారు.
హైదరాబాద్ నగరంలో దొంగలు మరోసారి రెచ్చిపోయారు. బోయిన్‌పల్లి పోలీస్‌స్టేషన్ పరిధిలోని ఓ ఇంట్లోకి చొరబడిన దుండగులు బంగారు, వెండి నగలతో పాటు భారీగా నగదు దోచుకుపోయారు.
ఓల్డ్ బోయిన్‌పల్లిలోని మల్లికార్జున్‌నగర్‌లో నివసించే సరళ అనే మహిళ వడ్డీ వ్యాపారం చేస్తుంటారు. అప్పు కావాల్సిన వారి వద్దనుంచి బంగారు, వెండి వస్తువులను తాకట్టు పెట్టుకుని రుణం ఇస్తుంటారు. దీంతో ఆమె ఇంట్లో భారీగా ఆభరణాలు ఉంటాయి. ఈ విషయాన్ని పసిగట్టిన దొంగలు సోమవారం ఆమె ఇంటిని దోచేశారు. సోమవారం ఓ పని నిమిత్తం బయటకు వెళ్లిన సరళ ఇంటికి వచ్చి తాళం తీసుకుని లోపలికి వెళ్లారు.
Discover more from TeluguWonders
Subscribe to get the latest posts sent to your email.
