హెచ్‌ఎండీఏ ల్యాండ్ పూలింగ్

*హెచ్‌ఎండీఏ ల్యాండ్ పూలింగ్: 10% వాటా పెంపు* హైదరాబాద్: హైదరాబాద్ మెట్రో పాలిటన్ డెవలప్‌మెంట్ అథారిటీ(హెచ్‌ఎండీఏ) ల్యాండ్ పూలింగ్‌లో భూ యజమానులకు 10శాతం వాటా పెంచుతూ ఉత్తర్వులు జారీ అయ్యాయి. ఇప్పటివరకు భూయజమానులకు, హెచ్‌ఎండీఏకు 50 – 50శాతంగా ఉన్న వాటా.. 60 – 40శాతంగా మారనుంది. ల్యాండ్ పూలింగ్ భూములకు భద్రత, ప్రయోజనం చేకూరుస్తామని హెచ్‌ఎండీఏ తెలిపింది. ల్యాండ్ పూలింగ్‌లో భూములకు సంబంధించిన అన్ని రకాల అనుమతుల వ్యవహారాలను తామే చూస్తామని వెల్లడించింది. రిజిస్ట్రేషన్ ఖర్చులు కూడా తామే భరిస్తామని హెచ్‌ఎండీఏ తెలిపింది. లేఔట్, ముసాయిదా ఆమోదం పొందిన ఆరు నెలల్లో భూయజమానులకు ప్లాట్లు ఇస్తామంది. హెచ్‌ఎండీఏ పరిధిలో 500 ఎకరాల్లో ల్యాండ్‌పూలింగ్ ప్రాజెక్టులు పురోగతిలో ఉన్నాయని పేర్కొంది.
Discover more from TeluguWonders
Subscribe to get the latest posts sent to your email.
