గుళ్లో శఠ గోపం (షడ గోప్యం) పెట్టించుకోవడం లో గల అర్ధం ఏమిటి..

దేవాలయంలో దర్శనం షడ గోప్యం తప్పక తీసుకోవాలి. చాలామంది దేవుడ్ని దర్శనం
చేసుకున్నాక వచ్చినపనైపోయిందని చక, చకా వెళ్ళి ఏదో ఏకాంత నిర్మల ప్రదేశం చూసుకొని కూర్చుంటారు.అలా చెయ్యకూడదు. కొద్ది సేపు ఆగి, షడగోప్యం
తల పైనపెట్టించుకోవాలి.
“షడగోప్యం” అంటే : అత్యంత రహస్యం అని అర్ధం. షడగోప్యంపెట్టే పూజారికి కూడా విన్పించనంత రహస్యంగా కోరికను తలుచుకోవాలి.
మానవులకు శత్రువులైన కామమూ, క్రోధమూ, లోభమూ, మోహమూ,మదమూ, మాత్సర్యముల వంటి వాటికి ఇక నుండి దూరంగా ఉంటామని తలుస్తూ తలవంచి తీసుకోవటము ఒక అర్ధం. మీ కోరికే షడగోప్యము.అది అత్యంత రహస్యం గా దేవుడికి మాత్రమే తల వంచి వినిపించాల్సిన విషయం.
Discover more from TeluguWonders
Subscribe to get the latest posts sent to your email.
