ప్రేమించి పెళ్లాడి.. నెల రోజులకే ప్రాణం తీశాడు

bride
బతుకుదెరువు కోసం కొద్దిరోజుల క్రితమే హైదరాబాద్ వచ్చి వనస్థలిపురం డివిజన్‌లోని చింతలకుంట శక్తినగర్ కాలనీలో నివాసముంటున్నారు. అక్కడే వాసవి కన్‌స్ట్రక్షన్ నిర్మిస్తున్న అపార్ట్‌మెంట్ పనుల్లో ఇద్దరూ కూలీలుగా పనిచేస్తున్నారు.
ప్రేమించి పెళ్లాడి నెల రోజులు తిరగకముందే భార్య ప్రాణాలు తీసిన ఘటన హైదరాబాద్ వనస్థలిపురంలో చోటుచేసుకుంది. నిర్మాణంలో ఉన్న భవనం నుంచి ఆమెను తోసేయడంతో అక్కడికక్కడే ప్రాణాలు కోల్పోయింది. మధ్యప్రదేశ్‌కు చెందిన దిలీప్ (26), సీమ(23)లు కొన్నాళ్ల నుంచి ప్రేమించుకుంటూ నెల రోజుల క్రితమే పెళ్లి చేసుకున్నారు.
బతుకుదెరువు కోసం కొద్దిరోజుల క్రితమే హైదరాబాద్ వచ్చివనస్థలిపురండివిజన్‌లోని చింతలకుంట శక్తినగర్ కాలనీలో నివాసముంటున్నారు. అక్కడే వాసవి కన్‌స్ట్రక్షన్ నిర్మిస్తున్న అపార్ట్‌మెంట్ పనుల్లో ఇద్దరూ కూలీలుగా పనిచేస్తున్నారు. బుధవారం(అక్టోబర్ 16) రాత్రి అదే అపార్ట్‌మెంట్‌లో కాసేపు ముచ్చటించుకున్న భార్యభర్తలు తర్వాత తీవ్రంగా వాదులాడుకున్నారు. దీంతో ఆగ్రహానికి లోనైన దిలీప్ మూడో అంతస్తు నుంచి భార్యను ఒక్క తోపు తోయడంతో ఆమె కింద పడిపోయింది.
తీవ్రగాయాలపాలైన సీమను స్థానికుల సాయంతో దిలీప్ ఉస్మానియా ఆస్పత్రికి తరలించాడు. తీవ్ర రక్తస్రావంతో గురువారం ఉదయం ఆమె ప్రాణాలు కోల్పోయింది. తన భార్య ప్రమాదవశాత్తూ పడిపోయిందని దిలీప్ పోలీసులకు చెప్పాడు. అయితే అనుమానం వచ్చిన పోలీసులు లోతుగా దర్యాప్తు చేయగా తానే తోసినట్లు అంగీకరించాడు. దీంతో వనస్థలిపురం పోలీసులు దిలీప్‌పై హత్యకేసు నమోదు చేసి అరెస్ట్ చేశారు.
Discover more from TeluguWonders
Subscribe to get the latest posts sent to your email.
