జగన్ నువ్వు జాగ్రత్త : ఉండవల్లి

హిట్ పిక్చర్ అని ప్రచారం జరిగిన సినిమా.. కొంత తేడా వచ్చినా బాగోలేదని అంటారు. అదే ఫెయిల్యూర్ సినిమా కొంచెం బాగోలేక పోయినా బాగుందని అంటారు. జగన్, ప్రభుత్వంలో చిన్న తప్పు జరిగినా.. దాన్ని ప్రజలు పెద్ద తప్పుగానే చూస్తారు. ఈ ప్రభుత్వం చాలా జాగ్రత్తగా వెళ్లాలి.’ అని సూచించారు. వైఎస్ జగన్… ముఖ్యమంత్రిగా బాధ్యతలు చేపట్టిన తర్వాత… ప్రతి విషయంలోనూ చాలా జాగ్రత్తగా ఉండాలని ఉండవల్లి సూచించారు. సోమవారం మీడియా సమావేశంలో మాట్లాడిన ఉండవల్లి… జగన్ కి పలు సూచనలు చేశారు.
🔴ఆయన చెప్పిన సూచనలు : ఇసుక మాఫియాను మొదట అరికట్టాలి.
👉అవినీతి నిర్మూలన కోసం : ప్రతి ప్రభుత్వ ఆఫీస్ ముందు అక్కడ పనిచేస్తున్న వాళ్ల జీతాల వివరాలను బోర్డు మీద రాయాలి. ఉద్యోగులకు జీతాలు ఇచ్చేది ప్రజలు. ఉద్యోగులు ప్రజల జీతంతో పనిచేస్తున్నారన్న విషయం ప్రజలకు తెలియాలి. నా సూచనపై ఆలోచించాలి’’ అని ఉండవల్లి పేర్కొంటూ..జగన్ కి పలు జాగ్రత్తలు చెప్పారు.
Discover more from TeluguWonders
Subscribe to get the latest posts sent to your email.
