ఢిల్లీ పర్యటనకు బయల్దేరిన సీఎం జగన్…….

ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి ఢిల్లీ పర్యటనకు బయల్దేరారు. ఇవాళ సాయంత్రం 4.30గంటలకు ప్రధాని మోడీతో సీఎం జగన్ సమావేశం కానున్నారు. రైతు భరోసా పథకాన్ని ప్రారంభించేందుకు సీఎం ప్రధానిని ఆహ్వానించనున్నారు. విభజన హామీలు, కడపలో ఉక్కు పరిశ్రమపై ప్రధాని మోడీతో చర్చించే అవకాశముంది. అలాగే కాకినాడ పెట్రో కెమికల్ కాంప్లెక్స్ తదితర అంశాలపై ప్రధానితో జగన్ చర్చించే అవకాశముంది. ఆ తర్వాత కేంద్ర హోంశాఖ మంత్రి అమిత్ షాను కలవనున్నారు.
source:https://www.prabhanews.com/2019/10/cm-jagan-to-departed-delhi/
Discover more from TeluguWonders
Subscribe to get the latest posts sent to your email.
