karthika Deepam : మోనిత కంట పడిన సౌర్య, కంగారులో ఇంద్రుడు
Karthika Deepam : ఇంద్రుడు, చంద్రమ్మ, సౌర్య ముగ్గురు కలిసి రోడ్డు పక్కనే ఉన్న ఐస్ క్రీమ్ షాప్ కు వెళ్తారు. ‘అమ్మా సౌర్యమ్మా ఇక్కడ ఐస్ క్రీమ్ చాలా బాగుంటుంది తింటావా?’ అని అడుగుతాడు. తింటాను ..తీసుకురా అని ఇంద్రుడుకు చెబుతుంది. దాంతో ఐస్ క్రీమ్ తీసుకొచ్చి సౌర్య కు తెచ్చి ఇస్తాడు. అది తింటూ ఉంటుంది సౌర్య. అయితే చంద్రమ్మ.. ‘గండా నాకు చాలా భయంగా ఉంది.. మన జ్వాలమ్మని ఎవరైనా చూస్తారేమోనని.. మన పని పూర్తి చేసుకొని ఇక్కడ నుంచి తొందరగా వెళ్లిపోదాం అని అంటుంది..అప్పుడు ఇంద్రుడు మనకి రావాల్సిన డబ్బులు వసూళ్లు చేసుకుని అలాగే వెళ్లిపోదాం’ అంటాడు ..ఐనా ‘ఒక్క గంటలో ఏం కాదులే చంద్రమ్మ.. నువ్వు అంత కంగారు పడకని ’ అంటాడు ఇంద్రుడు. ఇంతలో సౌందర్య, మోనితల కారు అటుగానే వస్తుంది.