హైదరాబాద్‌లో కూడా…వారికి హెల్మెట్ కంపల్సరీ

Spread the love

హైదరాబాద్‌లో బండిపై వెళ్తున్నారా ? అయితే ఇద్దరూ హెల్‌మెట్‌ పెట్టుకోవాల్సిందే.. ఈ నిబంధనను సైలెంట్‌గా అమల్లోకి తీసుకువచ్చారు ట్రాఫిక్ పోలీసులు. ఇప్పటికే 300 మందికి ఫైన్ కూడా వేశారు. డ్రైవింగ్ చేసే వారే కాకుండా.. బండిపై కూర్చున్న వారు కూడా హెల్మెట్ పెట్టుకోవాల్సిందే అంటున్నారు హైదరాబాద్ పోలీసులు. హైదరాబాద్, సైబరాబాద్,రాచకొండ కమిషనరేట్ల పరిధిలో… ఈ నిబంధన పోలీసులు అమలు చేస్తున్నారు. రోడ్డు ప్రమాదాలను తగ్గించేందుకే ఇద్దరికి హెల్మెట్ విధానాన్ని తీసుకువచ్చామంటున్నారు. గత ఏడాది జరిగిన రోడ్డు ప్రమాదాల్లో బైక్ వెనకాల కూర్చున్న వారే ఎక్కువ మంది మృతి చెందారని పోలీసులు చెబుతున్నారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *