Teluguwonders:
ప్రీమియం మొబైల్ ఫోన్ల కంపెనీ వన్ ప్లస్ మొబైల్స్ హైదరాబాద్‌లో వన్ ప్లస్ మొబైల్స్ ఆర్ అండ్ డీ సెంటర్‌ను ఏర్పాటు చేసింది. టీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్, వన్ ప్లస్ వ్యవస్థాపకుడు పీట్ లూ, కంపెనీ ప్రతినిధులు ఈ సందర్భంగా పాల్గొన్నారు. సెంటర్‌ను ప్రారంభించిన సందర్భంగా కేటీఆర్ మాట్లాడుతూ వన్ ప్లస్ ఆర్ అండ్ డీ కోసం వన్ ప్లస్ సంస్థ రూ.వెయ్యికోట్లు పెట్టుబడి పెట్టడం మంచి పరిణామమన్నారు. రెండేళ్లలో 1500 మంది ఉద్యోగులు ఇందులో పనిచేయనున్నారని కేటీఆర్ తెలిపారు. తయారీ సెంటర్‌ను హైదరాబాద్ లో ఏర్పాటు చేయాలని కోరుతున్నానని ఆయన పేర్కొన్నారు.2018లో కంపెనీకి భారీ రెవెన్యూ రావడంతో.. వన్ ప్లస్ కంపెనీ..
ప్రత్యేకించి ఇండియానే తమ మార్కెట్ విస్తరణలో ఒక భాగంగా ఎంచుకుంది. 2019 ఏడాదిలో మేము.. మూడు కొత్త ఎక్స్ పీరియన్స్ స్టోర్లను ఓపెన్ చేయబోతున్నామని ప్రకటించింది. పుణెలో ఒక ఎక్స్ పీరియన్స్ స్టోర్ ఓపెన్ చేస్తాం. హైదరాబాద్ లో ఓపెన్ చేయబోయే వన్ ప్లస్ స్టోర్ (16వేల చదరపు అడుగులు) ప్రపంచంలోనే అతిపెద్దది’ అని వన్ ప్లస్ వివరించింది.
ఇదిలాఉండగా, త్వరలో వన్ ప్లస్ టీవీ విడుదల కానుంది. చాలా రోజుల నిరీక్షణ తరువాత వన్‌ప్లస్ టీవీకి సంబంధించిన సమాచారాన్ని సంస్థ వెల్లడించింది. సెప్టెంబర్‌లో ఈ టీవీ లాంచ్ చేసే అవకాశమున్నట్టు సమాచారం. ఆ టీవీకి సంబంధించి ఫీచర్లు కూడా సోషల్‌మీడియాలో వైరల్ అవుతున్నాయి. 1080 రిజల్యూషన్‌తో మాత్రమే పనిచేసే ఈ టీవీ స్క్రీన్, 4కేకి కూడా అనువుగా ఉంటుందన్న వార్తలు వినిపిస్తున్నాయి. క్వాడ్‌కోర్ మీడియాటెక్ ఎంటీ5670 చిప్సెట్తో పనిచేస్తుందని చెబుతున్నారు. మాలి-జీ51 ఎంపీ3 జీపీయూతో వచ్చే ఈ టీవీకి 3జీబీ ర్యాం ఉంటుందంటున్నారు.
ఇదిలాఉండగా, ఇటీవలే వన్ ప్లస్ 7, 7 ప్రొ లను విడుదల ఒకేసారి విడుదల చేశారు. బెంగళూరు, లండన్, న్యూయార్క్ లలో ఒకే సారి ప్రాడక్ట్ ను పరిచయం చేస్తూ ఈవెంట్ ను నిర్వహించింది. ఎస్‌బీఐ క్రెడిట్/డెబిట్ కార్డుతో కొనుగోలు చేస్తే 2వేల రూపాయల ఇన్‌స్టంట్ డిస్కౌంట్ ఇస్తోంది.