పుష్ప 2 బ్లాక్ బస్టర్ హిట్ తర్వాత బన్నీ చేయబోయే సినిమాపై భారీ హైప్స్ ఏర్పడ్డాయి. అల్లు అర్జున్ నెక్ట్స్ ప్రాజెక్ట్స్ కోసం సౌత్ టూ నార్త్ అడియన్స్ ఎంతో ఆసక్తితో వెయిట్ చేస్తున్నారు. ఇన్నాళ్లు మాస్ యాక్షన్ హీరోగా వెండితెరపై సందడి చేసిన బన్నీని ఇప్పుడు అట్లీ ఏ విధంగా చూపించనున్నాడనే క్యూరియాసిటీ సైతం నెలకొంది.
ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ ప్రస్తుతం తన నెక్ట్స్ ప్రాజెక్ట్స్ ఎంపికలో బిజీగా ఉన్న సంగతి తెలిసిందే. గతేడాది పుష్ప 2 సినిమాతో బ్లాక్ బస్టర్ హిట్ అందుకున్నాడు బన్నీ. ప్రపంచవ్యాప్తంగా రూ.1800 కోట్లకు పైగా వసూళ్లు రాబట్టి సరికొత్త రికార్డ్స్ సొంతం చేసుకున్నాడు. ఇక ఇప్పుడు బాలీవుడ్ ఇండస్ట్రీలోనూ ఓ మూవీ చేయనున్నట్లు టాక్ నడుస్తుంది. అలాగే కోలీవుడ్ టాప్ డైరెక్టర్ అట్లీ దర్శకత్వంలోనూ అల్లు అర్జున్ ఓ సినిమా చేయనున్నట్లు తెలుస్తోంది. వీరిద్దరి తొలి కాంబినేషన్ చాలా సంచలనం సృష్టించింది. ఇందులో హాలీవుడ్ స్టార్స్ సైతం కనిపించనున్నట్లు తెలుస్తోంది. ఇక తాజాగా ఈ ప్రాజెక్ట్ గురించి మరో ఇంట్రెస్టింగ్ క్రేజీ న్యూస్ సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతుంది. లేటేస్ట్ అప్డేట్ ప్రకారం ఈ సినిమాలో కోలీవుడ్ స్టార్ హీరో శివకార్తికేయన్ ముఖ్య పాత్రలో కనిపించనున్నారట. అయితే దీనిపై ఇప్పటివరకు ఎలాంటి అధికారిక ప్రకటన రాలేదు.
అల్లు అర్జున్ చివరిసారిగా దర్శకుడు సుకుమార్ సూపర్ హిట్ చిత్రం పుష్ప 2: ది రూల్ లో కనిపించాడు. మైత్రి మూవీ మేకర్స్ నిర్మించిన ఈ చిత్రం ప్రపంచవ్యాప్తంగా రూ.1,800 కోట్లకు పైగా వసూలు చేసి.. బన్నీ సినీ కెరీర్‌లో అత్యధిక వసూళ్లు సాధించిన చిత్రంగా నిలిచింది. ఈ మూవీ తర్వాత అల్లు అర్జున్ తన తదుపరి చిత్రాన్ని దర్శకుడు అట్లీతో ప్రకటిస్తాడా లేదా త్రివిక్రమ్ శ్రీనివాస్‌తో ప్రకటిస్తాడా అనేది చూడాలి. ప్రస్తుతం శివకార్తికేయన్ శ్రీలంకలో పరాశక్తి సినిమా షూటింగ్‌లో పాల్గొంటున్నారని సమాచారం. ఈ చిత్రానికి సుధా కొంగర దర్శకత్వం వహించగా, ప్రముఖ నిర్మాణ సంస్థ డాన్ పిక్చర్స్ దీనిని నిర్మిస్తోంది. ఈ చిత్రంలో రవి మోహన్, అధర్వ, శ్రీలీల కూడా ముఖ్యమైన పాత్రల్లో నటిస్తున్నారు.
Discover more from Telugu Wonders
Subscribe to get the latest posts sent to your email.