గత కొద్ది రోజులుగా అమెరికా, ఉత్తరకొరియా మధ్య పరిస్థితులు మరోసారి దిగజారుతున్నట్టు కనిపిస్తున్నాయి..
♦కారణం ఏంటంటే : అమెరికా మొట్టమొదటి సారిగా ఉత్తరకొరియాకు చెందిన నౌకను స్వాధీనం చేసుకుంది. దాంతో అమెరికా పై కొరియా అధ్యక్షుడు గుర్రుగా ఉన్నాడు. 👉ఉత్తరకొరియా హెచ్చరిక : అమెరికా అక్రమంగా స్వాధీనం చేసుకున్న తమ కార్గో నౌకను ( వైస్ ఆనెస్ట్) వెంటనే తమకు అప్పగించాలని ఉత్తరకొరియా హెచ్చరించింది. 👉అమెరికా స్పందన : అంతర్జాతీయ ఆంక్షలను ఉల్లంఘిస్తూ ఉత్తరకొరియా నౌక ప్రయాణించడంతోనే స్వాధీనం చేసుకొని దర్యాప్తు చేపడుతున్నట్టు అమెరికా న్యాయశాఖ ప్రకటించినది.
👉ఈ నేపథ్యంలో : ఆ దేశ చర్యపై ఉత్తరకొరియా ఘాటుగా స్పందించింది. ‘గతేడాది జూన్12న ఉత్తరకొరియా-అమెరికా చేసిన సంయుక్త ప్రకటన స్ఫూర్తిని పూర్తిగా తోసిపుచ్చేలా ఈ చర్య ఉంది. మాపై వీలైనంత ఒత్తిడిని తెచ్చేలా అమెరికా ఈ చర్యకు పాల్పడింది’ అని ఉత్తరకొరియా రక్షణ శాఖ కార్యాలయం ప్రకటించింది. తమ శక్తితో ఉత్తరకొరియాను అదుపు చేయాలని అమెరికా భావించడం అవివేకమని తెలిపింది. ♦ గతేడాది అమెరికా అధ్యక్షుడు ట్రంప్, ఉత్తరకొరియా అధ్యక్షుడు కిమ్ జోంగ్ ఉన్ సింగపూర్‌లో తొలిసారిగా భేటీ అయ్యారు. రెండోసారి ఈ ఏడాది ఫిబ్రవరిలో వియత్నాం రాజధాని హానోరులో సమావేశమయ్యారు. 👉అణ్వస్త్ర నిరాయుధీకరణ, కొరియా ద్వీపకల్పంలో శాంతి స్థాపన, ఆంక్షల తొలగింపు తదితర అంశాలపై ఇరుదేశాధినేతలు సుదీర్ఘ మంతనాలు జరిపారు. అయితే, ఉత్తర కొరియాపై ఆంక్షల తొలగింపు అంశంపై అమెరికా వైఖరి మారకపోవడంతో చర్చలు విఫలమైనట్టు కిమ్ ప్రకటించారు. మూడోసారి చర్చల కోసం అమెరికా ప్రయత్నిస్తున్నప్పటికీ ఉత్తరకొరియా మాత్రం ఆసక్తి కనబర్చడం లేదు. అమెరికా పెడుతున్న డిమాండ్లు తమకు ఆమోదయోగ్యంగా లేవని ఇటీవల కిమ్ ప్రకటించారు. ఇటీవల దీర్ఘశ్రేణి బహుళ రాకెట్ లాంచర్లు, వ్యూహాత్మక గైడెడ్ ఆయుధాలను పరీక్షించిన ఉత్తరకొరియా వారం రోజులు కాక ముందే మరోసారి రెండు స్వల్ప శ్రేణి క్షిపణులను పరీక్షించింది. ఉత్తరకోరియా నౌకను స్వాధీనం చేసుకున్న అమెరికా మోసపూరిత చర్యలకు పాల్పడుతోందని కిమ్ విమర్శించారు. అమెరికా పద్దతి ఇలాగే ఉంటే కొరియా యుద్దాన్ని ప్రకటించినా ఆశ్చర్యం లేదు.చూద్దాం ఏమవుతుందో…