ఆవెంజర్స్ ఎండ్ గేమ్ అవతార్ ని అధిగమించబోతుందా..

Spread the love

 ప్రపంచవ్యాప్తంగా 46 దేశాల్లో అవెంజర్స్ ప్రభంజనం సృష్టిస్తుంది: అవెంజర్స్ ఎండ్‌గేమ్ చిత్రం అమెరికా, చైనా, భారత్ అనే తేడా లేకుండా ప్రపంచవ్యాప్తంగా 46 దేశాల్లో కలెక్షన్లను రాబడుతున్నది. ఈ మూవీ చిన్నా పెద్ద అనే తేడా లేకుండా అందర్ని ఆకట్టుకొంటున్నది.    ప్రపంచ బాక్సాఫీస్‌ను అవెంజర్స్ చిత్రం కుదిపేస్తున్నది.ఇది మార్వెల్ సినిమాటిక్ యూనివర్స్  22వ చివరి, చిత్రం కావడం తోఈ చిత్రానికి ప్రేక్షకులు బ్రహ్మరథం పడుతున్నారు. గత పదిరోజులగా కలెక్షన్ల సునామీని సృష్టిస్తూ విడుదలైన ప్రతీచోట రికార్డులను తిరగరాస్తుఉండడమే దీనికి నిదర్శనం. ఒకప్పుడు ప్రపంచ సినీ ప్రేక్షకులను ఉర్రూతలూగించిన అవతార్ రికార్డును అధిగమించేందుకు సుడిగాలి వేగంతో అవెంజర్స్ మూవీ దూసుకెళ్తున్నది. గత పది రోజుల్లో ప్రపంచవ్యాప్తంగా ఈ చిత్రం వసూళ్లలో 2 బిలియన్ డాలర్ల రికార్డుకు చేరువై  విజయవంతంగా రెండోవారంలోకి ప్రవేశించింది.

  🔅అవతార్, స్టార్ వార్స్ ఫోర్స్ అవేకన్స్ కలెక్షన్స్ ని ఇది అధిగమించబోతుందా : అవును ఈ చిత్రాల  కలెక్షన్లను అధిగమించే అవకాశం ఉంది. ఇప్పటికే ఈ చిత్రం 12590 కోట్లు అంటే 1.82 బిలియన్ డాలర్లను వసూలు చేసి స్టార్ వార్స్ రికార్డుపై గురి పెట్టింది.

👉అవతార్ చిత్రం : వరల్డ్ బాక్సాఫీస్ వద్ద అవతార్ అప్పట్లో 2.78 బిలియన్ డాలర్లు (రూ.19321 కోట్లు) వసూలు చేసి తిరుగు లేని రికార్డ్ ని సృష్టించింది

👉స్టార్ వార్స్ చిత్రం : అప్పట్లో 2.07 బిలియన్ డాలర్లు వసూలు చేసి అవతార్ తర్వాత  స్థానం   లో నిలిచింది.               ఈ వారాంతం తర్వాత అవెంజర్స్ చిత్రం మొదట స్టార్ వార్స్ రికార్డును బ్రేక్ చేసే అవకాశం ఉందని ట్రేడ్ వర్గాలు అభిప్రాయపడతున్నాయి

🔅ఇప్పటి వరకు వచ్చిన అవెంజర్స్: ఎండ్‌గేమ్ బాక్సాఫీస్  కలెక్షన్స్ :.    ఇండియన్ బాక్సాఫీస్ వద్ద  అవెంజర్స్: ఎండ్‌గేమ్ చిత్రం క్రేజీగా   రూ.400 కోట్ల క్లబ్ వైపు పరుగులు పెడుతున్నది.            దేశీయ బాక్సాఫీస్ వద్ద 300 కోట్లు వసూలు చేసిన తొలి హాలీవుడ్ చిత్రంగా రికార్డుకెక్కుతుంది అని ప్రముఖ ట్రేడ్ అనలిస్టు తరణ్ ఆదర్శ్ ట్వీట్ చేశారు.

🔴Collections  పై వాషింగ్టన్ పోస్ట్ విమర్శ : అవతార్‌ మూవీతో పోల్చి వాషింగ్టన్ పోస్ట్ అవెంజర్స్: ఎండ్‌గేమ్ వసూళ్లను తేలికగా తీసుకొన్నది.          అవతార్, స్టార్ వార్స్ సాధించిన వసూళ్లతో పోల్చుకొంటే గొప్పేమీ కాదని,2009 సంవత్సరంతో పోల్చుకంటే ఇప్పుడు ఉన్న టికెట్ రేట్లు చాలా ఎక్కువని ఇప్పుటి రేట్లతో పోల్చుకొంటే అవతార్ కలెక్షన్లు 3 మిలియన్ డాలర్లు దాటి ఉండేవని.. అవెంజర్స్‌తో పోల్చుకొంటే అవతార్ ప్రదర్శించిన థియేటర్లు కూడా తక్కువే అని వాషింగ్టన్ పోస్ట్ వెల్లడించింది.         చూద్దాం avengers ఇదే ఫోర్స్ లో.. అవతార్ ని అదిగమిస్తాడేమో.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *