ఆన్‌లైన్ బెట్టింగ్ యాప్స్‌ను ప్రమోట్ చేస్తోన్న సోషల్ మీడియా ఇన్‌ఫ్లూయెర్లపై పోలీసులు ఉక్కుపాదం మోపుతున్నారు. ఇప్పటికే సన్నీ యాదవ్, హర్షసాయి వంటి ఫేమస్ యూట్యూబర్లపై కేసులు నమోదయ్యాయి. అయితే ఇదే విషయంలో బిగ్ బాస్ తెలుగు విన్నర్ పై కూడా కేసు నమోదు కానుందని తెలుస్తోంది.
బెట్టింగ్ యాప్ ప్రమోషన్స్ పై పోలీసులు గట్టి నిఘా ఉంచుతున్నారు. డబ్బు కోసం వీటిని ప్రమోట్ చేస్తోన్న సోషల్ మీడియా ఇన్ ఫ్లూయెన్సర్లపై పోలీసులు వరుసగా కేసు నమోదు చేస్తున్నారు. ముఖ్యంగా సీనియర్ ఐపీఎస్ ఆఫీసర్, ఆర్టీసీ ఎండీ సజ్జనార్ ఈ బెట్టింగ్ యాప్స్ ప్రమోషన్స్ విషయాన్ని సీరియస్ గా తీసుకున్నారు. వీటిని ప్రమోట్ చేస్తున్న యూట్యూబర్లను సోషల్ మీడియా వేదికగా ఎండగడుతున్నారు. ఈక్రమంలో ఇప్పటికే ప్రముఖ తెలుగు ఫేమస్ యూట్యూబర్లైన భయ్యా సన్నీ యాదవ్, హర్ష సాయి తదితరులపై కేసులు నమోదు చేశారు సైబరాబాద్ పోలీసులు. కాగా సోషల్ మీడియా ఇన్‌ఫ్లూయెన్సర్లపై వరుసగా కేసులు నమోదు అవుతుండడంతో మరికొందరు సెలబ్రిటీలు ముందు జాగ్రత్త పడుతున్నారు. తమ పేజీలను డిలీట్ చేస్తున్నారు. అలాగే సురేఖ వాణి, సుప్రిత, రీతౌ చౌదరి లాంటి సినీ ప్రముఖులు కూడా తమ తప్పులు తెలసుకుని క్షమాపణలు చెబుతూ వీడియోలు రిలీజ్ చేస్తున్నారు.
కాగా ఈ ఆన్ లైన్ బెట్టింగ్ యాప్స్ ప్రమోషన్స్ లో బిగ్ బాస్ టైటిల్ విన్నర్, రైతు బిడ్డ పల్లవి ప్రశాంత్ కూడా ఉన్నట్లు తెలుస్తోంది. గతంలో పల్లవి ప్రశాంత్ క్రికెట్ ఓ క్రికెట్ ప్రెడిక్షన్స్ యాప్ ని బాగా ప్రమోట్ చేస్తూ వీడియోలు కూడా చేసినట్లు తెలుస్తోంది. ఇందుకోసం బెట్టింగ్ యాప్ నిర్వాహకుల నుంచి పెద్ద మొత్తంలోనే డబ్బులు అందుకున్నట్లు సమాచారం. ఇటీవల ప్రముఖ టూరిస్ట్ వ్లోగర్ అన్వేష్ ఈ విషయాన్ని బయట పెట్టాడు. పల్లవి ప్రశాంత్ చేసిన బెట్టింగ్ యాప్ వీడియోలని తన ఇన్ స్టా గ్రామ్ స్టోరీస్ లో షేర్ చేశాడు. దీంతో రైతు బిడ్డపై కూడా త్వరలోనే పోలీసు కేసు నమోదు కానున్నట్లు తెలుస్తోంది.
కాగా రైతు బిడ్డ ట్యాగ్ తో బిగ్ బాస్ తెలుగు సీజన్ 7 లోకి అడుగు పెట్టాడు పల్లవి ప్రశాంత్. తన ఫ్యాన్ ఫాలోయింగ్ తో ఏకంగా బిగ్ బాస్ టైటిల్ కూడా సొంతం చేసుకున్నాడు. ప్రస్తుతం పల్లవి ప్రశాంత్ కు సోషల్ మీడియాలో సుమారు 20 లక్షలకు పైగా ఫాలోవర్లు ఉన్నారు
Discover more from Telugu Wonders
Subscribe to get the latest posts sent to your email.